PM Kisan 21st Installment : రైతులకు పండగే.. పీఎం కిసాన్ 21వ విడత తేదీ ఇదే.. మీరు అర్హులేనా? కాదా? రూ. 2వేలు పడతాయో లేదో చెక్ చేసుకోండి..!

PM Kisan 21st Installment : పీఎం కిసాన్ రైతులకు అదిరిపోయే న్యూస్.. 21వ విడత రూ. 2వేలు అతి త్వరలోనే విడుదల కానున్నాయి. రూ. 2వేలు పడతాయో లేదో ఇలా చెక్ చేసుకోండి.

PM Kisan 21st Installment : రైతులకు పండగే.. పీఎం కిసాన్ 21వ విడత తేదీ ఇదే.. మీరు అర్హులేనా? కాదా? రూ. 2వేలు పడతాయో లేదో చెక్ చేసుకోండి..!

PM Kisan 21st Installment

Updated On : November 16, 2025 / 2:14 PM IST

PM Kisan 21st Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 21వ విడత వచ్చేస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) స్కీమ్ కింద 21వ విడతను నవంబర్ 19 (బుధవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సీబీటీ బదిలీ ద్వారా దేశంలోని 9 కోట్లకు పైగా పీఎం కిసాన్ లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు. ఇటీవల వరదల తర్వాత జమ్మూ కాశ్మీర్ రైతులకు కేంద్రం ఇప్పటికే 21వ విడత వాయిదాను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. అక్టోబర్ 7న (PM Kisan 21st Installment) జమ్మూ కాశ్మీర్‌లోని 8.5 లక్షల మంది రైతులకు మొత్తం రూ.170 కోట్లు బదిలీ అయ్యాయి. ఇప్పుడు ఇతర రైతులకు కూడా రూ. 2వేలు వారి అకౌంట్లలో జమ కానున్నాయి. మీరు కూడా పీఎం కిసాన్ లబ్ధిదారు రైతులైతే వెంటనే మీరు అర్హులో కాదో ముందుగానే చెక్ చేసుకోండి. లేదంటే రావాల్సిన రూ. 2వేలు డబ్బులు రావు. ఇంతకీ మీరు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇ-కేవైసీ తప్పనిసరి :
పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి 4 నెలలకు రూ. 2వేలు చొప్పున సంవత్సరానికి రూ. 6వేలు చొప్పున అందిస్తారు. ఈ డబ్బును ప్రతి ఏడాదిలో 3 విడతలుగా అందిస్తారు. ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చిలో లబ్ధిదారు రైతులు రూ. 2వేలు అందుకుంటారు. ఈ ఫండ్ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. అయితే, ఈ పథకానికి అర్హత పొందాలంటే రైతులు ముందుగా తమ e-KYCని రిజిస్టర్ చేసుకోవాలి.

Read Also : Samsung Galaxy S24 5G : అమెజాన్‌లో శాంసంగ్ 5G ఫోన్ దుమ్మురేపుతోంది.. ఈ ధర చూసిన వెంటనే ‘BUY NOW’ నొక్కేస్తారు..!

పీఎం కిసాన్ వాయిదాలను స్వీకరించేందుకు రైతులు తమ e-KYCని పూర్తి చేయాలి. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు eKYC తప్పనిసరి. OTP-ఆధారిత ఇకేవైసీ పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని CSC కేంద్రాలను సంప్రదించవచ్చు.

పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
సీఎస్‌సీ కేంద్రాల ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఈ కింది విధంగా తమ అప్రూవల్ స్టేటస్ చెక్ చేయవచ్చు.

1. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ (pmkisan.gov.in)ని విజిట్ చేయండి.
2. హోమ్‌పేజీలో ‘Farmers Corner’ సెక్షన్‌లో ‘Status of self-registered farmers/CSC farmers’పై క్లిక్ చేయండి.
3. మీ ఆధార్ నంబర్‌ ఎంటర్ చేసి మీ స్టేటస్ వెరిఫై కోసం క్యాప్చాను ఎంటర్ చేయండి.

పీఎం కిసాన్‌కు ఎవరు అర్హులు? :

  • పీఎం కిసాన్ 21వ విడతకు అర్హతలివే
  • భారత పౌరుడిగా ఉండాలి.
  • సొంత సాగు భూమి
  • చిన్న లేదా సన్నకారు రైతుగా ఉండాలి.
  • నెలకు రూ. 10వేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షనర్ కాకూడదు.
  • ఆదాయపు పన్ను దాఖలు చేసి ఉండకూడదు.
  • సంస్థాగత భూస్వామిగా ఉండకూడదు.

QR కోడ్ ద్వారా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? :
కొత్త రిజిస్ట్రేషన్లను అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) ద్వారా ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు. రైతులు ఈ పథకంలో రిజిస్టర్ చేసుకోవడానికి ఎక్స్ పోస్ట్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేయవచ్చు.