Oppo Find X9 Series : ఒప్పో నుంచి కిర్రాక్ ఫోన్లు భయ్యా.. మే 21నే వచ్చేస్తున్నాయ్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Oppo Find X9 Series : ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా, ఒప్పో ఫైండ్ ఎక్స్9s మే 21న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. రాబోయే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ప్రధానంగా ఫొటోగ్రఫీ, వీడియో రికార్డింగ్, లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ అందిస్తాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Oppo Find X9 Series

  • ఒప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్ వచ్చేస్తోంది
  • మే 21న ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా, ఎక్స్9ఎస్ లాంచ్
  • 200MP కెమెరా, 7050mAh బ్యాటరీ ఆప్షన్లు

Oppo Find X9 Series : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో నుంచి సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. ఒప్పో ఫైండ్ x9 అల్ట్రా, ఒప్పో ఫైండ్ ఎక్స్9s ఫోన్లు మే 21న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి.ఈ మేరకు ఒప్పో కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. రాబోయే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఫొటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ అందిస్తాయి. ఈ ఫోన్లలో కంపెనీ కెమెరా హార్డ్‌వేర్, కూలింగ్ సిస్టమ్ తో పాటు భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఆప్షన్ వస్తుంది.

ఈ రెండు మోడళ్లు ఒప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్‌లో పొందవచ్చు. ఫొటోగ్రఫీ ప్రియులు, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్. ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా, ఒప్పో ఫైండ్ ఎక్స్9ఎస్‌కు సంబంధించి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రాలో కంపెనీ సరికొత్త హాసెల్‌బ్లాడ్ మాస్టర్ కెమెరా సిస్టమ్ ఉంది. అడ్వాన్స్ కంప్యూటేషనల్ ఫొటోగ్రఫీ కోసం కొత్త LUMO ఇమేజ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 200MP ప్రైమరీ కెమెరా, రెండో 200MP 3x టెలిఫోటో సెన్సార్, 10x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.

Read Also : Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా భారీగా తగ్గిందోచ్.. ఇలా కొన్నారంటే ఇంకా తక్కువ ధరకే!

ఆ బ్రాండ్ ప్రకారం.. లోపలికి వచ్చే కాంతి కెమెరా సెన్సార్‌ను చేరేందుకు ముందు ఇంటర్నల్ ఐదుసార్లు పరావర్తనం చెందుతుంది. ఈ టెక్నాలజీతో సుమారుగా 230mmకు సమానమైన ఫోకల్ లెంగ్త్‌ను పొందవచ్చునని ఒప్పో పేర్కొంది.

వీడియో రికార్డింగ్ కోసం O-Log2 రికార్డింగ్, ACES కలర్ వర్క్‌ఫ్లో, కస్టమ్ 3D ఎల్‌యూటీ ఇంటిగ్రేషన్, 30fps వద్ద 8K వీడియో రికార్డింగ్, ప్రైమరీ టెలిఫోటో కెమెరాలు రెండింటిలోనూ 120fps వద్ద 4K క్యాప్చర్‌కు సపోర్టు ఇస్తుంది.

ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, ఒప్పో ట్రినిటీ ఇంజిన్, నెక్స్ట్-జనరేషన్ 3D క్రయో-వెలాసిటీ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ ఫోన్ 7050mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది.

ఒప్పో ఫైండ్ X9s విషయానికి వస్తే.. :
7.99mm సన్నని బాడీలో ట్రిపుల్ 50MP హాసెల్‌బ్లాడ్ కెమెరా సెటప్‌ అమర్చారు. ఈ ఫోన్ అన్ని కెమెరాల నుంచి 4K 60fps డాల్బీ విజన్ రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కలర్‌ఓఎస్ 16 ద్వారా ఏఐ-ఆధారిత టూల్స్ ద్వారా డ్యూయల్ వీడియో రికార్డింగ్‌ అందిస్తుంది. ఈ ఒప్పో ఫోన్ 3nm ప్రాసెస్‌పై మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్ పవర్ అందిస్తుంది.

ఒప్పో ఈ స్మార్ట్‌ఫోన్‌కు 32,052.5mm² హీట్ తగ్గించేందుకు అడ్వాన్స్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ అమర్చారు. ఒప్పో ఫైండ్ X9s ఫోన్ లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం భారీ 7025mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ కూడా ఉంది.

భారత్‌లో ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా, ఫైండ్ X9s ధర (అంచనా) :
ధరల విషయానికి వస్తే.. ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా భారత మార్కెట్లో రూ. 149,999 కన్నా ఎక్కువ ధరకు లాంచ్ అవుతుందని అంచనా. ఒప్పో ఫైండ్ ఎక్స్9s ధర సుమారు రూ. 70వేల మధ్య ఉండవచ్చు.