×
Ad

Oppo K15 Series : ఒప్పో ఫ్యాన్స్ గెట్ రెడీ.. కొత్త ఒప్పో K15 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..

Oppo K15 Series : భారత మార్కెట్లో ఒప్పో K15 సిరీస్ త్వరలో లాంచ్ కావచ్చు. ఒప్పో K15, ఒప్పో K15x ఫీచర్లు, ధర, లాంచ్ వివరాలపై ఓసారి లుక్కేయండి..

  • Published On : January 29, 2026 / 02:30 PM IST

Oppo K15 Series

  • త్వరలో భారత మార్కెట్లో ఒప్పో K15 సిరీస్ లాంచ్
  • ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ పేజీలో ఒప్పో ఫోన్
  • డ్యూయల్ రియర్ కెమెరాలతో పిల్-ఆకారపు మాడ్యూల్‌
  • మొత్తం 2 వేరియంట్లలో ఒప్పో K సిరీస్ మోడల్

Oppo K15 Series : ఒప్పో లవర్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఒప్పో నుంచి కొత్త ఫోన్ రాబోతుంది. ప్రత్యేకించి ఒప్పో K సిరీస్‌లో లాంచ్ కానుంది. అయితే, ఒప్పో ఇంకా లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు.

లీక్‌లను పరిశీలిస్తే.. ఒప్పో K15 సిరీస్‌ పేరుతో వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ K సిరీస్ మోడల్ మొత్తం రెండు వేరియంట్లలో రానుంది. బడ్జెట్-ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒప్పో కొత్త K సిరీస్‌కు సంబంధించి ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ ప్రీ-రిజిస్ట్రేషన్ పేజీ కూడా అప్‌లోడ్ చేసింది.

ఈ పేజీ ఫోన్లలో కొన్ని డిజైన్ వివరాలు కూడా రివీల్ చేసింది. డ్యూయల్ రియర్ కెమెరాలు పిల్-ఆకారపు మాడ్యూల్‌లో కనిపిస్తున్నాయి. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటుంది. ఫోన్ బ్యాక్ సైడ్ అన్ని వైపులా ఫ్లాట్ డిజైన్ ఉంటుంది. మిడ్-రేంజ్ ఫోన్‌లకు ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది.

Read Also : Best AI Phones : కొత్త AI ఫోన్ కావాలా? రూ. 50వేల లోపు 6 బెస్ట్ AI ఫోన్లు ఇవే.. ఫొటోగ్రఫీకి పర్‌ఫెక్ట్.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

ఒప్పో K15 సిరీస్ ఫీచర్లు (అంచనా) :
ఒప్పో ఇంకా ఫోన్ల పేర్లను వెల్లడించలేదు. కానీ, ఒప్పో K13 సిరీస్ నెక్స్ట్ వెర్షన్ ఒప్పో K15 సిరీస్ పేరుతో వస్తుందని భావిస్తున్నారు. ఎప్పటిలాగే, కంపెనీ పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్, స్పీడ్ ఛార్జింగ్‌పైనే ఫోకస్ పెడుతోంది. గతంలో ఒప్పో K సిరీస్ ఫోన్‌లు బాగా పాపులర్ అయ్యాయి. అందుకే ఒప్పో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది.

గత ఒప్పో K సిరీస్ విషయానికి వస్తే.. ఒప్పో K13 5జీ ఫోన్ ఏప్రిల్ 2025లో లాంచ్ అయింది. 6.7-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ బ్రైట్‌నెస్, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్, 7,000mAh బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అందిస్తుంది.

జూన్ 2025లో ఒప్పో K13x 5జీ ఫోన్ 6.67-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ బ్రైట్‌నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్, 6,000mAh బ్యాటరీ 45W ఛార్జింగ్ ఉన్నాయి. లీక్‌లను పరిశీలిస్తే.. ఫ్లిప్‌కార్ట్ పేజీలో ఒప్పో K15 సిరీస్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఒప్పో త్వరలో స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.