×
Ad

Oppo K15 Turbo Pro : ఇదో గేమ్ ఛేంజర్ భయ్యా.. 8000mAh బ్యాటరీతో ఒప్పో K15 టర్బో ప్రో వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్..!

Oppo K15 Turbo Pro : ఒప్పో నుంచి K సిరీస్ ఫోన్ రాబోతుంది. లాంచ్‌కు ముందుగానే ఒప్పో K15 టర్బో ప్రో కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. భారీ బ్యాటరీ ఉంటుందని అంచనా..

Oppo K15 Turbo Pro

Oppo K15 Turbo Pro : ఒప్పో నుంచి కిర్రాక్ ఫోన్ వస్తోంది భయ్యా.. కంపెనీ అతి త్వరలోనే చైనాలో లాంచ్ చేయనుంది. ఇటీవలి లీకుల ప్రకారం.. ఒప్పో K సిరీస్ స్మార్ట్‌ఫోన్ అనేక కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ 6.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా.

రాబోయే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. ఒప్పో K15 టర్బో ప్రో గేమింగ్-సెంట్రలైజడ్ ఆఫర్‌గా ఉండే అవకాశం ఉంది. గత జూలైలో చైనాలో లాంచ్ అయిన నెల తర్వాత భారత మార్కెట్లోకి వచ్చిన ఒప్పో K13 టర్బో ప్రో కన్నా బ్యాటరీ అప్‌గ్రేడ్స్‌తో వస్తుందని భావిస్తున్నారు. మీరు కూడా ఒప్పో లవర్స్ అయితే ఈ ఒప్పో K15 టర్బో ప్రో కీలక స్పెషిఫికేషన్లపై ఓసారి లుక్కేయండి.

ఒప్పో K15 టర్బో ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఒప్పో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను లీక్ చేసింది. టిప్‌స్టర్ ఫోన్ పేరును నేరుగా రివీల్ చేయలేదు. ఈ హ్యాండ్‌సెట్ ఒప్పో K15 టర్బో ప్రోగా సూచిస్తున్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుందని సమాచారం. ఒప్పో K15 టర్బో ప్రో ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల ఎల్టీపీఎస్ ఫ్లాట్ స్క్రీన్‌ కలిగి ఉండొచ్చు. ఈ హ్యాండ్‌సెట్ రౌండెడ్ కార్నర్స్ కొత్త డిజైన్‌ కలిగి ఉండవచ్చు. యాక్టివ్ కూలింగ్‌తో రానుంది. ఒప్పో K15 టర్బో ప్రో బ్యాటరీ సామర్థ్యంతో 8,000mAh ఉంటుందని అంచనా.

Read Also : Best Vivo Camera Phones : ఈ 5 వివో కెమెరా ఫోన్లు వేరే లెవెల్.. ఫొటోగ్రఫీ లవర్స్ తప్పక కొనాల్సిన ఫోన్లు.. ఫస్ట్ ఫోన్ రేంజే వేరబ్బా..!

ఇదే నిజమైతే, 7,000mAh బ్యాటరీతో ఒప్పో K13 టర్బో ప్రో కన్నా అప్‌గ్రేడ్ అవుతుంది. ఈ ఏడాది ఆగస్టులో భారత మార్కెట్లో ఒప్పో K13 టర్బో ప్రో లాంచ్ అయింది. ఒప్పో K13 టర్బోతో పాటు 8GB + 256GB ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ప్రారంభ ధర రూ. 37,999కు అందుబాటులో ఉంది. 1.5K రిజల్యూషన్‌తో 6.80-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 SoCపై రన్ అవుతుంది.

ఒప్పో K13 టర్బో ప్రోలో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్లు, 7,000mm స్టీమ్ కూలింగ్ చాంబర్‌ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు బైపాస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అదేవిధంగా, IPX6, IPX8, IPX9 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌ కలిగి ఉంది.