Oppo Reno 10 Pro 5G Price : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత్‌లో ఒప్పో రెనో 10ప్రో 5జీ ధర తగ్గింది.. ఎంతో తెలుసా?

కొత్త ఫోన్ కావాలా? ఒప్పో రెనో 10 ప్రో 5G ధరను తగ్గించింది. అద్భుతమైన ఫీచర్లతో సింగిల్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ వేరియంట్ కలిగి ఉంది. ఈ 5జీ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?

Oppo Reno 10 Pro 5G Price in India Slashed

Oppo Reno 10 Pro 5G Price : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో సబ్ బ్రాండ్ రెనో 10 ప్రో 5G ధర తగ్గింది. భారత మార్కెట్లో ఈ 5జీ ఫోన్ ధర రూ. 2వేలు తగ్గింది. దేశంలో నెక్స్ట్ జనరేషన్ ఒప్పో రెనో 11 లైనప్‌ను అతి త్వరలో లాంచ్ చేయనుంది. ఇంతలోనే ఈ రెనో 10 ప్రో ఫోన్ ధర తగ్గింది.

Read Also : ICICI Bank UPI Payments : ఐసీఐసీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూపే క్రెడిట్ కార్డ్‌లతో యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు..!

ఈ ఏడాది జూలైలో సాధారణ ఒప్పో రెనో 10 5జీ, ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5జీతో పాటు ఒప్పో రెనో 10 ప్రో 5జీ లాంచ్ అయింది. 6.7-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ ఓఎల్ఈడీ 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 778జీ 5జీ ఎస్ఓసీపై రన్ అవుతుంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఒప్పో రెనో 10 ప్రో 5జీ మోడల్ 80డబ్ల్యూ సూపర్‌వూక్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

భారత్‌లో ఒప్పో రెనో 10 ప్రో 5జీ ధర ఎంతంటే?:
భారత మార్కెట్లో ఒప్పో రెనో 10 ప్రో 5జీ మోడల్ జూలైలో రూ. 39,999 ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం సింగిల్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. రూ. 37,999కు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే స్మార్ట్‌ఫోన్ పాత ధరకు పొందవచ్చు. కొత్త ధర రిలయన్స్, క్రోమాతో సహా ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో గ్లోసీ పర్పుల్, సిల్వరీ గ్రే షేడ్స్‌ అనే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కొత్త ఒప్పో రెనో 11, ఒప్పో రెనో 11 ప్రోలను స్వదేశంలో ఆవిష్కరించిన కొద్ది రోజుల తర్వాత ధర తగ్గింది. ఈ ఫోన్‌లు త్వరలో భారత్‌లోకి ఎంట్రీ ఇస్తాయని భావిస్తున్నారు.

Oppo Reno 10 Pro 5G Price

ఒప్పో రెనో 10 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ :
ఒప్పో రెనో 10 ప్రో 5జీ ఆండ్రాయిడ్ 13-ఆధారిత కలర్ఓఎస్ 13.1పై రన్ అవుతుంది. హెచ్‌డీఆర్10 ప్లస్ సపోర్టుతో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080X 2,412 పిక్సెల్‌లు) ఓఎల్ఈడీ 3డీ కర్వ్డ్ డిస్‌ప్లే, గరిష్టంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ వరకు టచ్ రేట్‌ను కలిగి ఉంటుంది. హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 778జీ 5జీ ఎస్ఓసీని కలిగి ఉంది. దాంతో పాటు గరిష్టంగా 12జీబీ ర్యామ్ కూడా ఉంది. ఈ ర్యామ్‌ని వర్చువల్‌గా 8జీబీ వరకు విస్తరించవచ్చు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఒప్పో రెనో 10 ప్రో 5జీ మోడల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ ప్రైమరీ సోనీ ఐఎమ్ఎక్స్890 సెన్సార్, ఓఎస్ఎస్, 32ఎంపీ టెలిఫోటో సెన్సార్, 8ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 32ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. గరిష్టంగా 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ హ్యాండ్‌సెట్ ఇతర ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. 80డబ్ల్యూ సూపర్ వూక్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Flipkart Mobile Bonanza Sale : ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ మొదలైంది.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

ట్రెండింగ్ వార్తలు