×
Ad

Oppo Reno 13 5G : ఆఫర్ అదిరింది భయ్యా.. ఒప్పో రెనో 13 5జీ చౌకైన ధరకే.. ఇంత తక్కువకు మళ్లీ దొరకదు..!

Oppo Reno 13 5G : ఒప్పో రెనో 13 5జీ ఫోన్ ధర తగ్గింది. అమెజాన్ తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ క్రేజీ డీల్ అసలు వదులుకోవద్దు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?

Oppo Reno 13 5G

Oppo Reno 13 5G : ఒప్పో ఫోన్‌పై ఆఫర్ అదిరింది.. అమెజాన్‌లో కొత్త ఒప్పో రెనో 13 5G భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. తక్కువ ధరలో స్టైలిష్ ఫోన్‌ కోరుకునేవారికి అద్భుతమైన ఆప్షన్. ఈ స్పెషల్ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో రూ. 37,999కి భారత మార్కెట్లో లాంచ్ అయింది.

ఇప్పుడు దాదాపు రూ. 23వేలకి లిస్ట్ అయింది. అద్భుతమైన కెమెరాలు, లాంగ్ బ్యాటరీ (Oppo Reno 13 5G) లైఫ్ కోసమైన కొనేసుకోవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్లు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అమెజాన్ లో తక్కువ ధరకే ఒప్పో రెనో 13 5జీ ఫోన్ ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అమెజాన్‌లో ఒప్పో రెనో 13 డీల్ :
అమెజాన్‌లో ఒప్పో రెనో 13 5G ఇప్పుడు దాదాపు రూ.23వేలకు లభిస్తుంది. లాంచ్ అయినప్పటి ధర కన్నా దాదాపు రూ.15వేలు తగ్గింది. అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో మరిన్ని డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో రూ.1,164 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్‌ ట్రేడింగ్ చేయొచ్చు. ఒప్పో ఫోన్ వర్కింగ్ స్టేటస్ ఆధారంగా రూ.22,700 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Vivo S50 Pro Mini : వివోనా మజాకా.. వివో S50 ప్రో మినీ ఫోన్ వస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?

ఒప్పో రెనో 13 స్పెసిఫికేషన్లు :
ఒప్పో రెనో 13 5G స్మార్ట్‌ఫోన్ 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. షార్ప్ ఇమేజరీ, కలర్ ఫ్లూయిడ్ మోషన్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్ కలిగి ఉంటుంది. యాప్‌లు, ఫొటోలు, ఫైల్స్ కోసం 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కలిగి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో భారీ 5,600mAh బ్యాటరీ వేగంగా ఛార్జ్ చేయగలదు. IP66, IP68, IP69 రేటింగ్‌ కలిగి ఉంది.

కెమెరాల విషయానికొస్తే.. ఒప్పో రెనో 13 5G బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, వైట్ షాట్‌ల కోసం 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, డెప్త్, కాంట్రాస్ట్ కోసం 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.