OPPO Reno 16 Pro : చార్జింగ్ టెన్షన్ మరిచిపోండి.. ఒప్పో నుంచి కొత్త బ్యాటరీ బీస్ట్ వస్తోంది!

OPPO Reno 16 Pro : ఒప్పో రెనో 16 ప్రో వచ్చేస్తోంది. ఒప్పో రెనో 16, ఒప్పో రెనో 16 ప్రో, ఒప్పో రెనో 16FS అనే 3 మోడళ్లు ఉండవచ్చు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

OPPO Reno 16 Pro

  • ఒప్పో ఫోన్ డైమెన్సిటీ 8550 చిప్‌సెట్‌తో వస్తుందని అంచనా
  • 200MP మెయిన్ కెమెరా, ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌ ఆప్షన్
  • 50MP టెలిఫోటో కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా సెటప్

OPPO Reno 16 Pro : ఒప్పో లవర్స్ కోసం అద్భుతమైన ఫోన్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ కానుంది. ఒప్పో రెనో 16, రెనో 16 ప్రో, ఒప్పో రెనో 16FS ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో ప్రో మోడల్ డైమెన్సిటీ 8550 చిప్‌సెట్‌తో వస్తుందని అంచనా..

చైనీస్ మోడల్‌తో పోలిస్తే.. ఇందులో లో-కెపాసిటీ ప్రాసెసర్ ఉంటుంది. అలాగే స్మాల్ బ్యాటరీ (OPPO Reno 16 Pro) ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 7000mAh బ్యాటరీ బదులుగా 6700mAh బ్యాటరీ ఉండవచ్చు. ఈ సిరీస్ ఫోన్ గ్లోబల్ లాంచ్‌కు ముందే పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

ఒప్పో రెనో 16 గ్లోబల్ సిరీస్ :
ప్రపంచవ్యాప్తంగా ఒప్పో రెనో 16 సిరీస్ త్వరలో లాంచ్ కావచ్చు. ఇందులో ఒప్పో రెనో 16, ఒప్పో రెనో 16 ప్రో, ఒప్పో రెనో 16FS అనే 3 మోడళ్లు ఉండవచ్చు. లాంచ్ ముందే ప్రో మోడల్ స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.32-అంగుళాల కాంపాక్ట్ డిస్‌ప్లే ఉండవచ్చు. తద్వారా అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.

Read Also : Airtel Xstream : ఎయిర్‌టెల్ యూజర్లకు బ్రహ్మాండమైన ఆఫర్.. 20 OTT యాప్స్ జస్ట్ రూ. 99కే..!

ఒప్పో రెనో 16 ప్రో ఫోన్ 7000mAh బ్యాటరీతో వస్తోంది. గ్లోబల్ మోడల్‌లో 6700mAh బ్యాటరీ ఉండొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌, డైమెన్సిటీ 8550 చిప్‌సెట్ ఉండొచ్చు. ఈ ఫోన్‌లో 200MP మెయిన్ కెమెరాతో 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. 50MP టెలిఫోటో కెమెరా కూడా ఉన్నట్లు సమాచారం. సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ఒప్పో రెనో 16 ఫోన్ స్టాండర్డ్ వేరియంట్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌, 6.32-అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని అంచనా. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్, 50MP మెయిన్ కెమెరా, 6,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా.

ఒప్పో రెనో 16 ఎఫ్ఎస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ఉండొచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.57-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. 6,500mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. ఈ సిరీస్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. ఈ ఫోన్ సిరీస్‌కు IP69 రేటింగ్ ఉంటుందని అంచనా.