OPPO Reno8T 5G 8GB RAM price drops with a 23 Percent discount
Oppo Reno 8T 5G Offer : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే, ఒప్పో రెనో 5G మోడల్ ఫోన్ ఓసారి ట్రై చేయండి.. ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 8T 5G (OPPO Reno8T 5G) ఫోన్ తక్కువ ధరకు అందుబాటులో ఉంది. రూ.38,999 నుంచి రూ.29,999కు తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ గొప్ప డీల్ 23శాతం డిస్కౌంటుతో సొంతం చేసుకోవచ్చు. ఒప్పో Reno8T 5G ధర ఆన్‌లైన్ స్టోర్‌లో 23శాతం తగ్గింపుతో తగ్గింది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే.. రూ.29,000 వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
ఒప్పో రెనో 8T 5G స్పెసిఫికేషన్స్ :
ఒప్పో రెనో 8T 5G ఫోన్ 6.67-అంగుళాల AMOLED స్క్రీన్‌తో వచ్చింది. ఈ డిస్ప్లే 120Hz రేటుతో రిఫ్రెష్ అవుతుంది. ఫ్రంట్ స్క్రీన్ 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో పాటు 395ppi పిక్సెల్ డెన్సిటీని కూడా కలిగి ఉంది. ఒప్పో రెనో 8T 5G మొత్తం 3 కెమెరాలతో వస్తుంది. అందులో 108MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ లెన్స్, 13MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఈ 3 లెన్స్‌లు, 2 షూటింగ్ మోడ్‌లు, ISO కంట్రోల్, ఫేస్ డిటెక్షన్, ఇతర ఫీచర్లను కూడా అందిస్తాయి.
Oppo Reno 8T 5G Offer : OPPO Reno8T 5G 8GB RAM price drops with a 23 Percent discount
వినియోగదారులు ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీలకు 32MP మెయిన్ లెన్స్‌ను కూడా పొందవచ్చు. ఒప్పో రెనో 8T 5G ఫోన్ 8GB RAM కాన్ఫిగరేషన్, Qualcomm Snapdragon 695 CPUని కలిగి ఉంది. రెండు క్రియో 660 ఆర్కిటెక్చర్‌లు, అడ్రినో 619GPUతో కూడిన ఆక్టా-కోర్ CPUతో పాటు, కంపెనీ ఫోన్ పర్ఫార్మెన్స్ పెంచేసింది. ఈ ఫోన్‌లోని ఒప్పో రెనో 8T 5G ఫోన్ నాన్-రిమూవబుల్ సెల్ 4800mAh సామర్థ్యంతో వస్తుంది.