Best Smartphones in July : రూ. 40వేల లోపు ధరలో 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే కొనేసుకోండి..!
Best Smartphones in July : ఈ జూలైలో భారత మార్కెట్లో రూ. 40వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో (OnePlus Nord 3 5G) సహా మరో 3 స్మార్ట్ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Best Smartphones to buy in India under Rs 40,000 in July 2023
Best smartphones in July : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో సరసమైన ధర, ప్రీమియం పర్ఫార్మెన్స్ కోరుకునే వినియోగదారుల కోసం రూ. 40వేల సెగ్మెంట్లో అనేక మోడల్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో (OnePlus Nord 3) నుంచి (iQOO Neo 7 Pro) వరకు ప్రీమియం మిడ్-రేంజ్ డివైజ్‌లు, హై-క్వాలిటీ కెమెరాలు, లాంగ్ లైఫ్ బ్యాటరీలతో పాటు ఆకట్టుకునే ప్రాసెసింగ్ పవర్ వంటి ముఖ్యమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. భారత్‌లో రూ. 40వేల కన్నా తక్కువ ధర కలిగిన ఫోన్ల కోసం చూస్తున్న వినియోగదారులకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించే 5G ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఈ జూలైలో భారత మార్కెట్లో రూ. 40వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్లను ఓసారి లుక్కేయండి.
1. OnePlus Nord 3 5G :
వన్‌ప్లస్ నార్డ్ 3 5G ఫోన్ అద్భుతమైన డిజైన్‌ను కలిగిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ ఫ్లాట్ AMOLED 120Hz డిస్ప్లే మార్కెట్లో అత్యుత్తమమైనదిగా చెప్పవచ్చు. వార్నింగ్ స్లయిడర్ కలిగిన ఈ ఫోన్లో వివిధ నోటిఫికేషన్ మోడ్ల మధ్య మారడానికి సౌలభ్యాన్ని అందిస్తుంది. (OxygenOS 13.1) సాఫ్ట్వేర్ సున్నితమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. చక్కని యూజర్ ఇంటర్ఫేస్ను కలిగి ఉంది.

Best Smartphones to buy in India under Rs 40,000 in July 2023
80W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యంతో Nord 3 కొద్ది సమయంలోనే ఫుల్ బ్యాటరీ అవుతుంది. ఈ డివైజ్ అసాధారణమైన మల్టీ టాస్కింగ్ సామర్థ్యాలను నిర్వహించగలదు. 16GB RAM కలిగిన మొదటి Nord మోడల్‌గా కూడా నిలిచింది. ఈ వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ అన్ని ఫీచర్లు కలిగిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
2. iQOO నియో 7 ప్రో 5G :
ఐక్యూ నియో 7 Pro ఫోన్ Snapdragon 8+ Gen 1 SoC ద్వారా ఆధారితమైనది. అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఆకట్టుకునే పర్పార్మెన్స్ అందిస్తోంది. AMOLED డిస్ప్లే అద్భుతమైన బ్రైట్నెస్, విజువల్ క్వాలిటీని అందిస్తుంది. భారీ 5,000mAh బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ 120W ఛార్జింగ్‌తో, నియో 7 ప్రో క్షణాల వ్యవధిలో రీఛార్జ్ అవుతుంది. దాంతో రోజంతా ఛార్జింగ్ వస్తుంది. కెమెరా పనితీరు పరంగా చూస్తే.. ఆకట్టుకునే ఫలితాలను అందిస్తుంది. కెమెరా క్వాలిటీతో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. మొత్తంమీద నియో 7 ప్రో మెరుగైన ఫీచర్లు, ఆకర్షణీయమైన పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంటుంది.

Best Smartphones to buy in India under Rs 40,000 in July 2023
3. OnePlus 11R 5G :
వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ అనేది కొత్త 5G ఫోన్. హార్డ్‌కోర్ పర్పార్మెన్స్ కోరుకునే వారికి OnePlus 11R బెస్ట్ ఆప్షన్. రూ. 39,999 ప్రారంభ ధరలో ఫ్లాగ్షిప్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్, 100W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రైమరీ కెమెరా బాగుంది. దాదాపుగా OnePlus 11 5G క్వాలిటీతో వస్తుంది. 6.74-అంగుళాల డిస్ప్లే రెండు వైపులా కర్వడ్ ఎడ్జ్ కలిగి ఉంది. గరిష్టంగా 16GB RAM, అదనంగా 12GB వర్చువల్ RAMతో వచ్చిన వన్‌ప్లస్ 11R 5G చాలా టాస్క్‌లను నిర్వహించడానికి తగినంత శక్తిని అందిస్తుంది. గేమర్లు ఫోన్ పటిష్టమైన బ్యాటరీ లైఫ్, పర్పార్మెన్స్ అందిస్తుంది. ఆల్ ఇన్ ఆల్, టాప్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. OnePlus 11R బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కెమెరా సామర్థ్యాలతో పాటు డిజైన్ యూజర్లను కట్టిపడేసేలా ఉంది.
4. Vivo V27 Pro 5G :
సరసమైన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. Vivo V27 Pro 5G ఒక అద్భుతమైన ఆప్షన్. భారత మార్కెట్లో రూ. 40వేల లోపు ధరలో అద్భుతమైన ప్రొఫైల్, సొగసైన డిజైన్‌ను అందిస్తుంది. వివో V27 Pro ఫీచర్ల పరంగా అద్భుతమైన ఆప్షన్లతో వచ్చింది. అసాధారణమైన కెమెరా సిస్టమ్ నైట్ షాట్లను అద్భుతంగా క్యాప్చర్ చేయగలదు. అలాగే పగటిపూట ఫొటోలను కూడా క్యాప్చర్ చేస్తుంది. పెళ్లి వేడుకల్లో కూడా ఫొటోగ్రఫీకి అద్భుతమైన డివైజ్ అని చెప్పవచ్చు. వివో V27 ప్రో మోడల్ ఫోన్ స్పీకర్లు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.