Threads App : థ్రెడ్స్ తడాఖా.. అత్యంత వేగంగా అగ్రస్థానం.. ఒక మిలియన్ చేరడానికి ఏయే సోషల్ యాప్‌కు ఎంతకాలం పట్టిందో తెలుసా?
Threads App : ట్విట్టర్‌కు పోటీగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొత్త సోషల్ యాప్‌గా థ్రెడ్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి 48 గంటల వ్యవధిలోనే మిలియన్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. కొన్ని సోషల్ యాప్స్ ఒక మిలియన్ యూజర్ల మైలురాయిని చేరుకోవడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా?

Threads becomes fastest growing social media app
Threads App : ప్రముఖ సోషల్ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter)ను తలదన్నేలా కొత్త సోషల్ యాప్ థ్రెడ్స్ దూసుకుపోతోంది. లాంచ్ అయిన కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్ది యూజర్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. చాలా ఏళ్లుగా, ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg), ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మస్క్ మామ ట్విట్టర్ టేకోవర్ చేయగా.. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ట్విట్టర్‌ను ఢీకొట్టేలా కొత్త థ్రెడ్స్ యాప్ తీసుకొచ్చాడు. అత్యంత పోటీదారుగా థ్రెడ్స్ యాప్ జూలై 6న సోషల్ మీడియాలోకి అందుబాటులోకి వచ్చింది.
ఈ కొత్త థ్రెడ్స్ యాప్ లాంచ్ అయిన మొదటి కొన్ని గంటల్లోనే 10 మిలియన్ల యూజర్లను చేరుకుంది. థ్రెడ్స్ యాప్ వినియోగదారులు (Instagram) అకౌంట్ తప్పక కలిగి ఉండాలి. థ్రెడ్స్ అకౌంట్ ప్రొఫైల్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు.. ఇప్పటికే ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి బయో ఇన్ఫర్మేషన్, ఫాలోవర్లను ఇంపోర్ట్ చేసుకునే ఆప్షన్‌ను యాప్ అందిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే ఉన్న భారీ యూజర్‌బేస్‌కు యాక్సెస్‌ను ఇస్తుంది. తద్వారా థ్రెడ్స్ యాప్‌కు సపోర్టుగా పనిచేస్తుంది. ఊహించని రీతిలో మిలియన్ల యూజర్లతో దూసుకుపోతున్న థ్రెడ్స్ యాప్.. కేవలం కొద్ది గంటల్లోనే 80 మిలియన్ల వినియోగదారులకు చేరుకుంది. అయితే, సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒక మిలియన్ వినియోగదారులను చేరుకోవడానికి ఏయే యాప్‌కు ఎంత సమయం పట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also : Threads App: థ్రెడ్స్ యాప్ వచ్చేసింది.. నాలుగు గంటల్లోనే ఐదు మిలియన్ల డౌన్‌లోడ్స్
ట్విట్టర్ – 2 సంవత్సరాలు :
ఇతర సోషల్ ప్లాట్‌ఫారమ్‌లతో పోలిస్తే.. థ్రెడ్స్ యాప్ వినియోగదారులను అత్యంతగా ఆకట్టుకుంటోంది. కొద్ది గంటల వ్యవధిలోనే మిలియన్ల మంది యూజర్లతో దూసుకుపోతోంది. మరో పోటీదారు ట్విట్టర్ (Twitter) స్టాటిస్టా నుంచి వచ్చిన డేటా ప్రకారం.. ట్విట్టర్ జూలై 2006లో లాంచ్ అయింది. 2008లో మిలియన్ వినియోగదారులను చేరుకోవడానికి ట్విట్టర్‌కు దాదాపు 2 సంవత్సరాలు పట్టింది.
ఫేస్‌బుక్ – 10 నెలలు :
గాడ్‌ఫాదర్ ఆఫ్ థ్రెడ్స్ యాప్.. (Facebook) వేగంగా అభివృద్ధి చెందుతున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా ఉంది. జుకర్‌బర్గ్ మొట్టమొదటిగా 2004లో ఫేస్‌బుక్ లాంచ్ చేశారు. హార్వర్డ్ యూనివర్శిటీలో తన వసతి గృహంలో ఫేస్‌బుక్‌ను స్థాపించిన 10 నెలల తర్వాత మిలియన్ యూజర్ మైలురాయిని చేరుకుంది.

Threads becomes fastest growing social media app
ఇన్‌స్టాగ్రామ్ – 2.5 నెలలు :
అక్టోబర్ 2010లో ఇన్‌స్టాగ్రామ్ లాంచ్ అయింది. అప్పటినుంచి ఇన్‌స్టాగ్రామ్ మిలియన్ల డౌన్‌లోడ్‌ను చేరుకోవడానికి కేవలం రెండున్నర నెలల సమయం పట్టింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ జుకర్‌బర్గ్ మెటా సామ్రాజ్యంలో భాగంగా ఉంది. ఈ ఫొటో షేరింగ్ యాప్ మిలియన్ యూజర్లకు చేరుకున్నా ఇప్పటికీ స్వతంత్ర సంస్థలోనే ఉంది. అయితే, ఫేస్‌బుక్ 2012లో 1 బిలియన్ డాలర్లకు ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేసింది.
నెట్‌ఫ్లిక్స్ – 3.5 సంవత్సరాలు :
మూవీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మైలురాయిని పొందడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ మిలియన్ యూజర్లను చేరుకోవడానికి పట్టిన సమయం కన్నా ముందుగానే ట్విట్టర్ మిలియన్ యూజర్లను చేరుకుంది. ట్విట్టర్ ప్రారంభానికి ఏడేళ్ల ముందు 1999లో నెట్‌ప్లిక్స్ లాంచ్ అయింది.
Spotify – 5 నెలలు
నెట్‌ఫ్లిక్స్ మాదిరిగానే Spotify స్ట్రీమింగ్ ట్రయిల్‌బ్లేజర్.. Spotify లాంచ్ అయిన 5 నెలల తర్వాత మిలియన్ మార్కును చేరుకుంది. మార్చి 2009లో స్పాటిఫై యాప్ లాంచ్ అయింది.
ChatGPT – 5 రోజులు :
థ్రెడ్స్ యాప్‌కు అత్యంత సమీప పోటీదారుగా చాట్ జీపీటీ (ChatGPT) ఒక మిలియన్ వినియోగదారులను అత్యంత వేగంతో చేరుకోవడానికి కేవలం 5 రోజుల సమయం పట్టింది. ChatGPT అనేది ఒక AI చాట్‌బాట్.. ఈ ఏఐ టూల్ లాంచ్ అయిన 5 రోజుల తర్వాత మొదటి వారంలో 1 మిలియన్ డౌన్‌లోడ్ మైలురాయిని చేరుకుంది.
Read Also : Threads APP: థ్రెడ్స్ యాప్‌లో ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేస్తే మళ్లీ తొలగించలేరు.. తొలగించాలంటే?