Download e-PAN card Online : మీ పాన్‌కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో ఇలా పొందొచ్చు!

పాన్ కార్డు కోల్పోతే కంగారు పడకండి. మళ్లీ కొత్తగా పాన్ కార్డు తీసుకోవాల్సిన పనిలేదు. అదే పాన్ కార్డును మళ్లీ ఆన్‌లైన్ లో సులభంగా పొందచ్చు.

Download e-PAN card online : ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు ఎంతో ముఖ్యమని అందరికి తెలుసు. బ్యాంకు అకౌంట్లు, మనీ ట్రాన్సాక్షన్లకు పాన్ కార్డు తప్పనిసరిగా అడుగుతారు. అలాంటి ముఖ్యమైన పాన్ కార్డు కోల్పోతే కంగారు పడకండి. మళ్లీ కొత్తగా పాన్ కార్డు తీసుకోవాల్సిన పనిలేదు. అదే పాన్ కార్డును మళ్లీ ఆన్‌లైన్ లో సులభంగా పొందచ్చు. అందుకు మీరు చేయాల్సిందిల్లా.. పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడమే.. అదే ఎలానో ఓసారి చూద్దాం.. ముందుగా ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌కార్డు (e-Pancard Download)ను డౌన్‌లోడ్ చేయాలంటే https://www.utiitsl.com/ అనే వెబ్‌సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది UTI అధికారిక వెబ్‌సైట్‌. ఒకసారి ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. PAN card Services ఆప్ష‌న్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీకు Apply PAN Card అనే ఆప్ష‌న్‌ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ వెంటనే Download e-PAN ఆప్ష‌న్ పై క్లిక్ చేయండి. అయితే ఇక్కడ మీ పాన్‌కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.

పాన్ కార్డు వివరాలంటే.. మీ పుట్టిన తేదీ, పాన్ కార్డు నెంబ‌ర్‌ సహా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత Submit బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. అంతే.. వెంటనే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ కు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీని వెరిఫై చేసుకోండి. మీ మొబైల్ కు ఒక OTP వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. OTP ఎంట‌ర్ చేస్తే చాలు.. క్షణాల్లో ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌కార్డు (e-Pancard Download) డౌన్‌లోడ్ అయిపోతుంది. మీరు పాన్‌కార్డు కోసం అప్ల‌య్ చేసిన సమయంలో మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చి ఉంటారు. అందులో ఏదో ఒకదాని ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పాన్ కార్డు ప్రింట్ అవసరమైతే.. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) వెబ్ సైట్ విజిట్ చేయండి. ఇక్కడ మీ కొత్త పాన్‌కార్డు ప్రింట్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు. ఈ కొత్త పాన్ కార్డు మీ రిజిస్టర్డ్ అడ్రస్ కు చేరడానికి క‌నీసం 10 నుంచి 15 రోజులు పట్టొచ్చు. అలోగా పాన్‌కార్డుతో ఏదైనా అవ‌స‌రం ఉంటే.. ఇలా ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోని వినియోగించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఒకవేళ మీ పాన్ కార్డు కోల్పోతే వెంటనే పై విధంగా ఫాలో అయి ఈ-పాన్ కార్డు డౌన్ లోడ్ చేసేసుకోండి.

ట్రెండింగ్ వార్తలు