Paytm Launches Special Flight Fares For Armed Forces, Students
Paytm Special Flight Offer : ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. విమాన టికెట్ల బుకింగ్‌పై స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. విమాన టికెట్లపై 15శాతం నుంచి 50శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అందరికి కాదండోయ్.. కొందరికి మాత్రమే.. సాయుధ దళాల సిబ్బంది, కాలేజీ విద్యార్థులు, సీనియర్ సీటిజన్లకు ఆఫర్ చేస్తోంది. పేటీఎం అందించే ఈ స్పెషల్ ఆఫర్.. ఇండిగో, గో ఎయిర్, స్పైస్ జెట్, ఎయిర్ ఏసియా సర్వీసులపై వర్తిస్తుంది.
ఈ ఆఫర్ ద్వారా కాలేజీ విద్యార్థులు 10 కిలోల వరకు ఎక్స్‌ట్రా లగేజీని తీసుకెళ్లవచ్చు. పేటీఎం ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ట్రావెల్ టికెటింగ్ అనేది చాలా ప్రాధాన్యమైనది. ట్రావెలింగ్ విషయంలో పేటీఎం యూజర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విమాన టికెట్లను రిజర్వ్ చేసుకునేలా డిజిటల్ కంపెనీ ఈ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది.
ఇందులో భాగంగానే పేటీఎం ప్రముఖ మేజర్ డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌లో పార్టనర్‌గా కొనసాగిస్తోంది. పేటీఎం యూజర్లు.. ఫ్లైట్ టికెట్లు, ఇంటర్‌సిటీ బస్సులు, రైల్ టికెట్లను సులభంగా బుక్ చేసుకోవడానికి పేటీఎం ఈ స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇటీవలే విమాన ప్రయాణాలపై కూడా EMI ఫెసిలిటీని కూడా పేటీఎం తీసుకొచ్చింది. అలాగే PNR ధ్రువీకరణ స్టేటస్, లైవ్ రన్నింగ్ స్టేటస్, కాంటాక్ట్ లెస్ బస్సు టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు.
Read Also : LPG Cylinder : వంట గ్యాస్ సిలిండర్ బరువు భారీగా తగ్గింపు..? కేంద్రం కీలక ప్రతిపాదన