Paytm Users
Paytm Users : పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 31లోగా ఈ పని పూర్తి చేయండి. లేదంటే భారీగా నష్టపోతారు. సెప్టెంబర్ 1 నుంచి లక్షలాది మంది భారతీయులు (Paytm Users) పేటీఎం పేమెంట్లలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఇన్సూరెన్స్ ప్రీమియంలు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సబ్‌స్క్రిప్షన్‌లు, ఆటో-పేమెంట్ సర్వీసులు అకస్మాత్తుగా ఆగిపోవచ్చు. అసలు కారణం ఏమిటంటే.. పేటీఎం పాత యూపీఐ హ్యాండిల్ @paytm పూర్తిగా షట్‌డౌన్ కానుంది. పాత @paytm హ్యాండిల్‌కు లింక్ చేసిన ఆటో-పేమెంట్‌లను వెంటనే క్యాన్సిల్ చేయండి. లేదంటే కస్టమర్లకు ఇబ్బందులు ఎదురుకాక తప్పదు.
పేటీఎం షట్‌డౌన్ ఎందుకంటే? :
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో జరిగిన అవకతవకల కారణంగా ఆర్బీఐ గత ఏడాదిలో ఈ హ్యాండిల్‌ను నిషేధించింది. NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్) అందరు @paytm యూజర్లను ఇతర బ్యాంకులకు మార్చమని ఆదేశించింది. కానీ, చాలా మంది ఇంకా తమ ఆటో-పేను మార్చుకోలేదు.
ఆగస్టు 31 చివరి గడువు :
ఆగస్టు 31 చివరి గడువుగా NPCI తెలిపింది. ఇప్పటికే ఈ గడువు తేదీని రెండుసార్లు పొడిగించారు. ఇప్పుడు ఎక్కువ సమయం ఉండదు. బ్యాంకులు, కంపెనీలు కస్టమర్లు వెంటనే కొత్త పేమెంట్ లింక్‌ను వెంటనే సెట్ చేసుకోవాలని హెచ్చరించాయి.
పేటీఎం కస్టమర్లు వెంటనే ఈ పని చేయాలి? :
1. మీ అన్ని ఆటో-పేమెంట్లు (ఇన్సూరెన్స్, సబ్‌స్ర్కిప్షన్, లోన్ ఈఎంఐ మొదలైనవి) చెక్ చేయండి.
2. ఎక్కడైనా @paytm లింక్ ఉంటే వెంటనే క్యాన్సిల్ చేయండి.
3. కొత్త బ్యాంక్ అకౌంట్ (SBI, HDFC, PhonePe లేదా Paytm, Yes Bank వంటివి) నుంచి కొత్త ఆటో-పే అథరైజ్ చేయండి. గుర్తుంచుకోండి.. ఏ కంపెనీ లేదా బ్యాంకు మీ అనుమతి లేకుండా మీ ఆటో-పే మార్చలేవు. ఈ పని మీరే చేయాల్సి ఉంటుంది.
అసలు సమస్య ఎక్కడంటే? :
ఇన్సూరెన్స్ ప్రీమియం : దాదాపు రూ. 14వేల కోట్ల వార్షిక ప్రీమియంలు నిలిచిపోయే అవకాశం ఉంది. పాలసీ క్లోజ్ అయ్యే రిస్క్ ఉంటుంది.
OTT, యాప్ సబ్‌స్క్రిప్షన్ : నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, స్పాటిఫై వంటి సర్వీసులు అకస్మాత్తుగా ఆగిపోవచ్చు.
లోన్, క్రెడిట్ కార్డ్ పేమెంట్ : ఈఎంఐ కట్టకపోతే ఆలస్య రుసుము విధించవచ్చు లేదా మీ క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ కావచ్చు.
ఇలా చేయకపోతే.. :
మీరు సెప్టెంబర్ 1కి ముందు ఆటో-పే ట్రాన్స్‌ఫర్ చేయకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు రిమైండర్‌లను పంపుతాయి. సబ్‌స్క్రిప్షన్ సర్వీసులు నిలిచిపోతాయి. మాన్యువల్ పేమెంట్ చేయాల్సి వస్తుంది.