Pixel 7a Price Leaked ahead of May 10 launch
Pixel 7a Price Leak : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ నుంచి సరికొత్త 7a సిరీస్ రాబోతోంది. అధికారికంగా మే 10న (Google IO 2023) ఈవెంట్‌లో పిక్సెల్ 7a ఫోన్ లాంచ్ కావాల్సి ఉంది. అయితే, లాంచ్ కావడానికి కొన్ని రోజుల ముందే ఈ ఫోన్ ధర వివరాలు లీకయ్యాయి. (MySmartPrice) ప్రకారం.. సింగపూర్ ఆధారిత ఇ-రిటైలర్‌లో Pixel 7a ధర (SGD 749)గా ఉంది. అంటే.. భారత కరెన్సీలో దాదాపుగా రూ. 46,000 వరకు ఉండొచ్చు. ఆసక్తికరంగా, 2022 పిక్సెల్ 6a సింగపూర్‌లో ఒకే 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ అదే ధరతో లాంచ్ అయింది.
భారత మార్కెట్లో పిక్సెల్ 7a, పిక్సెల్ 6a కన్నా ఎక్కువ లేదా తక్కువ ధరకు ఉండొచ్చు. గత పిక్సెల్ మోడల్.. దేశంలో రూ. 43,999కి రిలీజ్ అయింది. అనేక లీక్‌లు Pixel 7a ధర రూ. 50వేల లోపు ఉంటుందని సూచిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కారణంగా ధర రూ. 45వేల వరకు పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు తక్కువగా ఉన్నందున, గూగుల్ సేల్స్ కూడా అదే స్థాయిలో మార్కెట్లోకి తీసుకురావొచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో మే 11న Pixel 7a అమ్మకానికి వస్తుందని గూగుల్ వెల్లడించింది. ఈ ఫోన్ మే 10న (Google IO) ఈవెంట్‌లో ఆవిష్కరించనుంది. ఈ ప్రదర్శనను రాత్రి 10:30 PM ISTకి లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. అయితే, కంపెనీ ఇప్పటివరకూ అధికారిక స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు.. లీక్‌లను పరిశీలిస్తే.. Pixel 7a ఫోన్ Google Tensor G2 SoCతో వచ్చే అవకాశం ఉంది.
Pixel 7a Price Leaked ahead of May 10 launch
Google Pixel 7, Pixel 7 Proకి ప్రాసెసర్ అందిస్తుంది. ఈ రోజుల్లో కనీసం 6.3-అంగుళాల స్క్రీన్‌లు ఉన్న చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే.. 6.1-అంగుళాల స్క్రీన్‌తో రావొచ్చు. గూగుల్ కలర్ ఆప్షన్లకు వస్తే.. OLED స్క్రీన్‌తో రావొచ్చు. మృదువైన స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. గూగుల్ స్మార్ట్‌ఫోన్‌లు కెమెరా పర్ఫార్మెన్స్‌తో వస్తాయి. గత ఏడాది వరకు ఎక్కువగా సాఫ్ట్‌వేర్, ప్రాసెసింగ్ ఫీచర్లలోనే మార్పులతో వచ్చాయి.
ఈ ఏడాదిలో గూగుల్ మెరుగైన, స్టిల్ ఫొటోలను అందించేలా Pixel 7aలో బ్యాక్ కెమెరా హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేస్తుంది. 64/48-MP ప్రైమరీ కెమెరాతో పాటు 12-MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలకు 10.8MP కెమెరా ఉండవచ్చు. Pixel 7a 5Gతో రావొచ్చు. అయితే మరికొన్ని అప్‌గ్రేడ్‌లు కూడా ఉండవచ్చు.
ఈ ఫోన్ సరసమైన ధరకే రావడానికి క్వాలిటీ ప్లాస్టిక్ కావచ్చు. Pixel 7a యాస్ అప్పీల్ ఉన్నప్పటికీ, Google IO ఈవెంట్‌లో ఇతర ప్రొడక్టులపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ముందుగా, ఆండ్రాయిడ్ 14, కంపెనీ మొదటి టాబ్లెట్ (పిక్సెల్ టాబ్లెట్), ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ (పిక్సెల్ ఫోల్డ్)లపై ఫోకస్ పెట్టనుంది. అంతేకాదు.. గూగుల్ బార్డ్ (Google Bard AI)లో కొత్త అప్‌డేట్‌లను కూడా ఈవెంట్లో ప్రదర్శించే అవకాశం ఉంది.