Digital Arrest Fraud : ‘డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్’తో తస్మాత్ జాగ్రత్త.. దేశ ప్రజలను హెచ్చరించిన ప్రధాని మోదీ.. ఈ 3 దశలు తెలుసుకోండి!

Digital Arrest Fraud : "డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్" విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. డిజిటల్ భద్రతకు మూడు ముఖ్యమైన దశలను వివరించారు.

PM Modi cautions against digital arrest fraud

Digital Arrest Fraud : ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ మోసంపై ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు.

అక్టోబర్ 27, ఆదివారం నాడు ‘మన్ కీ బాత్’ 115వ ఎపిసోడ్‌లో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. “డిజిటల్ అరెస్ట్ మోసం”పై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి పోలీసు యూనిఫాం ధరించిన ఆడియో-వీడియో క్లిప్‌ను ప్లే చేశారు. అందులో మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేసేందుకు బాధితుడి ఆధార్ నంబర్‌ను అడుగుతుడటం అందులో కనిపిస్తోంది.

ఈ ఆడియో క్లిప్‌ను ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ.. “ఈ ఆడియో కేవలం సమాచారం కోసం కాదు. ఇది వినోదం ఆడియో కాదు.. ఇది తీవ్ర ఆందోళన కలిగించేది. మీరు ఇప్పుడే విన్న సంభాషణ డిజిటల్ అరెస్ట్ మోసానికి సంబంధించినది. ఈ సంభాషణలో బాధితుడు మోసగాడి మధ్య జరుగుతుంది. ఈ మోసగాళ్లు ఫోన్ కాల్స్ చేస్తారని, కొన్నిసార్లు పోలీసు అధికారులు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నార్కోటిక్స్, కొన్నిసార్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అధికారులుగా నమ్మించి మోసగించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇలాంటి వారిపట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఈ మోసాల ముఠాలు ఎలా పని చేస్తాయి.. ఈ ప్రమాదకరమైన గేమ్ ఏంటి అనేది కూడా ప్రధాని మోదీ వివరించారు. ఈ డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్‌ భద్రతకు సంబంధించి మూడు ముఖ్యమైన దశలను ఆయన హైలెట్ చేశారు.

ముందుగా.. సైబర్ నేరగాళ్లు.. మీ వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం సేకరిస్తారు. భయానిక వాతావరణాన్ని సృష్టించడం.. యూనిఫాం, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, చట్టపరమైన విభాగాలు, ఫోన్‌లో మిమ్మల్ని ఎంతగానో భయపెడతాయి. ఇప్పుడే నిర్ణయించుకోవాలి.. లేకుంటే మిమ్మల్ని అరెస్టు చేస్తారు బాధితురాలిపై మానసిక ఒత్తిడిని సృష్టించి భయపడతారు” అని ప్రధాని మోదీ వివరించారు.

డిజిటల్ భద్రతకు మూడు దశలివే :
డిజిటల్ భద్రతకు సంబంధించిన మూడు దశలను ప్రధాని మోదీ వివరించారు. స్టాప్, థింక్, టేక్ యాక్షన్ అనే ఈ మూడు దశల గురించి తెలియజేశారు.

స్టాప్ : “మీకు కాల్ వచ్చిన వెంటనే ఆపివేయండి. భయపడకండి.. ప్రశాంతంగా ఉండండి. తొందరపాటు చర్యలు తీసుకోకండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకండి. వీలైతే స్క్రీన్‌షాట్ తీసుకోండి. కాల్ తప్పనిసరిగా రికార్డ్ చేయండి” అని ప్రధాని అన్నారు.

థింక్ : “ఏ ప్రభుత్వ సంస్థ కూడా మిమ్మల్ని ఇలా ఫోన్‌లో బెదిరించదు. ఇలాంటి వీడియో కాల్‌పై విచారించదు లేదా డబ్బు డిమాండ్ చేయదు. మీకు భయంగా అనిపిస్తే.. ఏదో తప్పు జరిగిందని తెలుసుకోండి.”

టేక్ యాక్షన్ : “జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930కి డయల్ చేయండి. (cybercrime.gov.in)లో రిపోర్టు చేయండి. కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలియజేయండి. సాక్ష్యాలను భద్రపరచండి. ‘Stop’ ఆపై ‘థింక్’, ఆపై ‘టేక్ యాక్షన్’ తీసుకోండి. ఈ మూడు దశలు మీ డిజిటల్ భద్రతకు రక్షణగా మారతాయి.

అందరూ జాగ్రత్త వహించాలి :
ప్రతి తరగతి, వయస్సు వర్గాలకు చెందిన ప్రజలు “డిజిటల్ అరెస్టు”కు గురవుతారని ప్రధాన మంత్రి హెచ్చరించారు. “మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇతరులు కూడా అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం” అని ఆయన అన్నారు. ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలా విచారించదని మీరు తెలుసుకోవాలని మోదీ అన్నారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ లాంటి వ్యవస్థ లేదని ప్రధాని హెచ్చరించారు. ఇది కేవలం మోసం, అబద్ధం మాత్రమేనన్నారు.

Read Also : Actor Vijay TVK : రాజకీయాల్లో నేను చిన్నపిల్లాడినే.. కానీ భయపడను.. వెనక్కి తగ్గేదేలేదు.. ఫస్ట్ స్పీచ్‌తోనే అదరగొట్టిన విజయ్