×
Ad

POCO F8 Pro : ఖతర్నాక్ ఫీచర్లతో పోకో F8 ప్రో వచ్చేస్తోంది.. నవంబర్ 26నే లాంచ్.. ఈ 5 ఫీచర్లు భలే ఉన్నాయి బ్రో..!

POCO F8 Pro Specs : కొత్త పోకో కావాలా? పోకో F8 ప్రో అతి త్వరలో రాబోతుంది. లాంచ్ కు ముందే కీలక ఫీచర్ల వివరాలు రివీల్ అయ్యాయి..

POCO F8 Pro

POCO F8 Pro Specs : కొత్త పోకో ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ నెల 26న పోకో F8 ప్రో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ చైనీస్ రెడ్‌మి K90 స్మార్ట్‌ఫోన్ రీబ్రాండ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లకు ఫోన్ లాంచ్ సమయంలో కొద్దిగా స్వల్ప మార్పులతో కంపెనీ రిలీజ్ చేస్తుంటాయి.

భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర  (POCO F8 Pro) దాదాపు 38,999 ఉండొచ్చునని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అడ్రినో 830 జీపీయూతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. మీరు 120Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద అమోల్డ్ డిస్‌ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6210 లేదా 7000mAh బ్యాటరీ ప్యాక్‌ పొందవచ్చు. పోకో F8 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యే ముందు ఈ 5 ఫీచర్లకు సంబంధించి ఓసారి లుక్కేయండి.

1. డిస్‌ప్లే :
పోకో F8 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.59-అంగుళాల లేదా 6.72-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 3500 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ డాల్బీ విజన్ HDR10+ సపోర్టు ఇస్తుంది.

2. డ్యూరబిలిటీ :
పోకో F8 ప్రో స్మార్ట్‌ఫోన్ అత్యంత మన్నికైనది. ఎందుకంటే దుమ్ము, నీటి నిరోధకతకు IP68 రేటింగ్ కలిగి ఉంది. మెరుగైన ఆడియో క్వాలిటీ కోసం సౌండ్ బై బోస్ ట్యూనింగ్ సేఫ్ అన్‌లాకింగ్ కోసం ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా పొందవచ్చు.

Read Also : Best Budget Smartphones : మోటోరోలా ఫ్యాన్స్ మీకోసమే.. రూ. 20వేల లోపు ధరలో బెస్ట్ బడ్జెట్ ఫోన్లు.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

3. పర్ఫార్మెన్స్ :
పోకో F8 ప్రో స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పాటు అడ్రినో 830 జీపీయూతో పవర్ అందించే అవకాశం ఉంది. గేమింగ్ రోజువారీ వినియోగానికి హై పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 12GB LPDDR5X ర్యామ్, 256GB లేదా 512GB UFS 4.0తో సహా స్టోరేజీ ఆప్షన్లతో వస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు.. షావోమీ కస్టమ్ HyperOS 3 ఇంటర్‌ఫేస్‌తో ఆండ్రాయిడ్ 16తో అందించే అవకాశం ఉంది.

4. కెమెరా సెటప్ :

పోకో F8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 50MP మెయిన్ సోనీ లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్, OIS 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 50MP 2.5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 24fps వద్ద 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అయితే, ఫ్రంట్ సైడ్ 20MP సెల్ఫీ కెమెరాను పొందవచ్చు.

5. బ్యాటరీ ప్యాక్ :
పోకో F8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6210mAh, 7000 mAh బ్యాటరీ ప్యాక్ ఉండొచ్చు. 100W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. మీ టాబ్లెట్‌లు, మొబైల్‌లు లేదా ల్యాప్‌టాప్ వంటి ఇతర డివైజ్‌లకు ఛార్జ్ చేసేందుకు అద్భుతంగా ఉంటుంది.