Poco M6 Pro set to debut in India on Jan 11
Poco M6 Pro India Launch : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు పోకో ఎం6 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను పోకో ఎక్స్6 5జీ సిరీస్‌తో పాటు జనవరి 11న జరిగే ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. పోకో ఎం6 ప్రో హీలియో జీ99-అల్ట్రా చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుందని కూడా ధృవీకరించింది. పోకో ఎం6 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్ పోకో ఎక్స్6 5జీ సిరీస్‌తో పాటు హెలియో జీ99-అల్ట్రా చిప్‌సెట్‌తో రానుంది.
పోకో ఎం6 ప్రో 4జీ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ + పోఎల్ఈడీ ప్యానెల్, 64ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండవచ్చు. గత ఏడాది ఆగస్టులో భారత మార్కెట్లో పోకో ఎం6 ప్రో 5జీ వెర్షన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో ప్రారంభమైంది. పోకో ఎం6 4జీ, రెడ్‌మి నోట్ 13 ప్రో 4జీ రీబ్రాండెడ్ వెర్షన్, బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండవచ్చునని భావిస్తున్నారు.
పోకో ఎం6 ప్రో 4జీ స్పెషిఫికేషన్లు :
ఈ వారం ప్రారంభంలో పోకో ఎం6 ప్రో 4జీ రెండర్‌లు అమెజాన్ యూఏఈ వెబ్‌సైట్‌లో జాబితా ద్వారా చూడవచ్చు. స్మార్ట్‌ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ + పోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉండవచ్చని లిస్టింగ్ వెల్లడించింది. పోకో ఎం6 ప్రో హీలియో జీ99 అల్ట్రా చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.
Poco M6 Pro India
గరిష్టంగా 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీని కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ పరంగా.. పోకో ఎం6 ప్రో 4జీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్టుతో 64ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉండవచ్చు.
ఈ పోకో ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో రావచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 67డబ్ల్యూ ఛార్జర్‌ని కలిగి ఉంటుంది. పోకో ఎం6 4జీ ఫోన్ 12జీబీ ర్యామ్/512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఏఈడీ 899 అని లిస్టింగ్ వెల్లడించింది. భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 20వేలుగా సూచిస్తుంది. ఆసక్తికరంగా, పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 10,999 నుంచి ప్రారంభమవుతుంది. 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి రూ. 13,499 వరకు ఉంటుంది.
Read Also : Moto G34 5G Launch : మోటో జీ34 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 9నే లాంచ్.. ధర, ఫీచర్లు వివరాలివే..!