×
Ad

Price Hike Alert : బిగ్ షాకింగ్ న్యూస్.. ఈ స్మార్ట్‌ఫోన్లు ఇక కొనడం కష్టమే? భారీగా పెరగనున్న ఒప్పో, వివో, వన్‌ప్లస్, షావోమీ ఫోన్ల ధరలు.. ఫుల్ డిటెయిల్స్..!

Price Hike Alert : భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అతిపెద్ద మార్పు రాబోతుంది. రాబోయే ఫోన్‌లు అధిక ధరలకు లాంచ్ కావచ్చు. పాత ఫోన్‌ల ధరలు కూడా పెరగవచ్చు.

Price Hike Alert

Price Hike Alert : స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. అతి త్వరలోనే స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రత్యేకించి ఆండ్రాయిడ్ ఫోన్లు అత్యంత ఖరీదైనదిగా మారనున్నాయి. అందులో ఒప్పో, వివో, షావోమీ, వన్‌ప్లస్ వంటి బ్రాండ్లు తమ రాబోయే స్మార్ట్‌ఫోన్లను అధిక ధరలకు లాంచ్ చేయనున్నాయి.

అదేవిధంగా, ఇప్పటికే లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్ (Price Hike Alert) ధరలు కూడా భారీగా పెరగవచ్చు. ఇటీవలే వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 15ను రూ. 72,999 ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో రూ. 69,999 ప్రారంభ ధరకు లాంచ్ అయిన వన్‌ప్లస్ 13 కన్నా రూ. 3వేలు ఎక్కువ ఖరీదైనది.

వన్‌ప్లస్‌తో పాటు, ఈ ఏడాదిలో లాంచ్ అయిన ఆపిల్ కొత్త ఐఫోన్ 17 సిరీస్ కూడా అధిక ధరకు లాంచ్ అయింది. ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ. 82,999కి లాంచ్ అయింది. గత ఏడాదిలో ఐఫోన్ 16 కన్నా రూ.5వేలు ఎక్కువ. ఈ ఏడాదిలో ఐఫోన్ 256GB ప్రారంభ స్టోరేజీ వేరియంట్‌లో వస్తుంది. అదనంగా, రాబోయే ఐక్యూ 15, ఒప్పో ఫైండ్ X9 సిరీస్‌లను కూడా అధిక ధరకు లాంచ్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు తమ రాబోయే ఫోన్‌లను అధిక ధరకు ఎందుకు లాంచ్ చేయనున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Oppo Find X9 Series : ఒప్పో ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 18నే ఒప్పో ఫైండ్ X9 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?

స్మార్ట్‌ఫోన్‌లు కాస్టలీగా ఎందుకు మారనున్నాయంటే? :

దీనికి సంబంధించి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత రోజుల్లో AI చిప్‌లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. దీని కారణంగా చిప్‌సెట్ తయారీదారులు ఏఐ చిప్ ప్రొడక్టులపై దృష్టి సారించారు. ఏఐ చిప్‌లకు డిమాండ్ ఫ్లాష్ మెమరీ చిప్‌ల ఉత్పత్తిపై ప్రభావం చూపింది.

ఫలితంగా, సరఫరా గొలుసు ప్రభావితమైంది. ఫ్లాష్ మెమరీ చిప్‌లకు ఇంకా డిమాండ్ పెరుగుతోంది. టెక్ కంపెనీలు ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఫ్లాష్ మెమరీ చిప్‌లను ఉపయోగిస్తాయి. అధిక డిమాండ్ కారణంగా మెమరీ చిప్‌లకు డిమాండ్ మరింత పెరిగింది. దీని వల్ల సరఫరాదారులు ధరలు పెరగవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాదు.. స్మార్ట్ టీవీలతో సహా ఫ్లాష్ మెమరీ చిప్‌లను ఉపయోగించే అన్ని ఎలక్ట్రానిక్ ప్రొడక్టులు సైతం ఖరీదైనవిగా మారొచ్చు.

భారీగా పెరిగిన ఒప్పో, వివో ధరలు :
మెమరీ చిప్‌ సరఫరా గొలుసు సమస్యలతో స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లు కూడా ఆలస్యం కావచ్చు. ఫలితంగా రాబోయే చాలా స్మార్ట్‌ఫోన్‌ల ధర ప్రస్తుత మోడళ్ల కన్నా రూ. 3వేల వరకు ఎక్కువగా ఉండవచ్చు. ఉదాహరణకు.. ఒప్పో ఈ ఏడాదలో రిలీజ్ చేసిన ఒప్పో రెనో 14, రెనో 14 ప్రో ధరలను రూ. 2వేలుగా నిర్ణయించింది. వివో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లైన వివో T4x, వివో T4x లైట్ ధరలను కూడా రూ. 500 తగ్గించింది. భవిష్యత్తులో అనేక ఇతర బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.