PUBG Mobile Ban: దేశంలో ఇక రాదు.. కనపడదు..

  • Publish Date - October 30, 2020 / 11:52 AM IST

PUBG Mobile Ban:ప్రపంచంలో అత్యంత జనాదరణ పొందిన మొబైల్ యాక్షన్ గేమ్, బ్యాటిల్ గేమ్ PUBG మొబైల్.. భారతదేశంలో ఈ గేమ్ ఆడుతున్న అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్. ఇప్పటికే దేశంలో బ్యాన్ చేసిన ఈ గేమ్‌ను పూర్తిగా ఆపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో దేశంలో ఇప్పటికే నిషేధానికి గురైన పబ్‌జీ.. ఇక పూర్తిగా కనుమరుగైపోతుంది.


PUBG Mobile తన సేవలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తన కంపెనీ అఫిషియల్ ఫేస్‌బుక్ పేజ్ ద్వారా అధికారిక ప్రకటన చేసింది. ఇవాళ(అక్టోబర్ 30,2020)నుంచి వినియోగదారులు అందరికీ పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ కు సంబంధించి అన్ని సేవలు రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో గత నెలలో గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ తొలగించబడింది.



https://10tv.in/jio-fastest-mobile-network-with-19-3-mbps-download-speed-vodafone-tops-in-upload-trai/
అయితే అప్పటికే తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ అయ్యినవారు మాత్రం పబ్‌జీని ప్రశాంతంగా ఆడుకున్నారు. అయితే లేటెస్ట్ నిర్ణయం ప్రకారం ఇకపై అటువంటి అవకాశం కూడా ఇక్కడి వినియోగదారులకు లేదు. అయితే సంస్థ తన పోస్ట్‌లో వినియోగదారుల డేటా గోప్యత గురించి ప్రస్తావించింది. ‘యూజర్ డేటా రక్షణకు కంపెనీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇచ్చిందని, భారతదేశంలో వర్తించే డేటా రక్షణ చట్టాలు మరియు నిబంధనలను పాటించినట్లు చెప్పుకొచ్చింది. భారతదేశంలో PUBG మొబైల్‌కు లభించిన ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు అని చెప్పుకొచ్చింది.