Mastercard RBI: మాస్టర్‌కార్డ్‌కు ఆర్బీఐ షాక్.. కొత్త కార్డుల జారీపై ఆంక్షలు!

ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్‌కార్డ్‌ (Master Card)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గట్టి షాక్ ఇచ్చింది. మాస్టర్ కొత్త కార్డుల జారీపై నిషేధం విధించింది. జూలై 22 నుంచి మాస్టర్ కొత్త కార్డుల జారీపై ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

RBI restricts Mastercard New Cards Issue : ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్‌కార్డ్‌ (Master Card)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గట్టి షాక్ ఇచ్చింది. మాస్టర్ కొత్త కార్డుల జారీపై నిషేధం విధించింది. జూలై 22 నుంచి మాస్టర్ కొత్త కార్డుల జారీపై ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల నుంచి కొత్తగా భారతీయ కస్టమర్లను ఎవరినీ చేర్చుకోవద్దని ఆర్బీఐ ఆదేశించింది. కొత్త డొమెస్టిక్ డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కస్టమర్ల కార్డులు మూడింటికి ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది.

చెల్లింపుల సమాచారం నిల్వ (Payment systems data)కు సంబంధించిన నిబంధనలను మాస్టర్‌కార్డ్ ఉల్లంఘించిందని RBI ఈ చర్యలు తీసుకుంది. ఇప్పటికే జారీ చేసిన మాస్టర్ కార్డ్ కస్టమర్ల విషయంలో మాత్రం మాస్టర్‌కార్డ్ యథాతథంగా తమ సర్వీసులను కొనసాగించవచ్చని పేర్కొంది. పేమెంట్ వ్యవస్థల డేటాను Payment and Settlement Systems Act, 2007 (PSS Act) కింద భారత్‌లోనే స్టోర్ చేయాలంటూ అన్ని పేమెంట్ సర్వీస్ సంస్థలను RBI 2018 ఏప్రిల్‌లోనే ఆదేశించింది.

ఈ మేరకు ఆయా సంస్థలకు 6 నెలల గడువు విధించింది. మాస్టర్ కార్డ్ ఇప్పటికీ ఆర్బీఐ మార్గదర్శకాలను అమలు చేయలేదు. దాంతో ఆర్బీఐ మాస్టర్ కార్డుపై ఆంక్షలు విధించింది. మూడు నెలల క్రితమే అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ (American Express and Diners Club International) సంస్థలు నిబంధనలు ఉల్లంఘించాయి. ఈ సంస్థల కొత్త కార్డుల జారీపై కూడా ఆర్బీఐ ఆంక్షలు విధించింది.

ట్రెండింగ్ వార్తలు