Realme 11 Pro Plus : 200MP కెమెరాతో రియల్‌మి 11ప్రో ప్లస్ ఫోన్.. భారత్‌లో మే 16నే లాంచ్.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Realme 11 Pro Plus : రియల్‌మి 11 Pro+ 200MP కెమెరా ఫీచర్లతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Vivo X90 Pro, Xiaomi 13 అల్ట్రా వంటి మరిన్ని లేటెస్ట్ కెమెరా సెంట్రిక్ ఫోన్ల మాదిరిగా ఉండనుంది. ఇందులో ఆసక్తికరమైన కెమెరా మాడ్యూల్ కూడా ఉంది.

iPhone 15 Price Leak Expected specifications, launch timeline, price and other details

Realme 11 Pro Plus Launch India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి (Realme) భారత మార్కెట్లోకి త్వరలో అరంగేట్రం చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మే 16న భారత్‌లో రియల్‌మి 11 ప్రో+ రియల్‌మే 11 ప్రోలను లాంచ్ చేయనుంది. రియల్‌మి ఇంకా లాంచ్ వివరాలను ధృవీకరించలేదు. కానీ, టిప్‌స్టర్‌లు ఇండియా లాంచ్ తేదీని అంచనా వేశారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు కొన్ని రోజుల క్రితమే చైనాలో అధికారికంగా లాంచ్ అయ్యాయి. రియల్‌మి 11 ప్రో సిరీస్ (Realme 11 Pro+) 200-MP కెమెరాను కలిగి ఉండనుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో Vivo X90 Pro, Xiaomi 13 అల్ట్రా వంటి లేటెస్ట్-కెమెరా సెంట్రిక్ ఫోన్ ఫీచర్లతో రానుంది. ఇందులో ఆసక్తికరమైన కెమెరా మాడ్యూల్ కూడా ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ దేబయన్ రాయ్ ఈ స్మార్ట్‌ఫోన్‌లు మే 16న భారత మార్కెట్లో లాంచ్ అవుతాయని ధృవీకరించారు. స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మి 11 ప్రో+, రియల్‌మి 11 ప్రోతో సహా రెండు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ధర విషయానికి వస్తే.. రియల్‌మి 11 ప్రో ధర రూ. 22వేలు, రూ. 23వేల మధ్య ఉంటుందని రాయ్ తెలిపారు. మరోవైపు, రియల్‌మి 11 Pro+ ధర సుమారు రూ. 28వేలు నుంచి రూ. 29వేల మధ్య ఉండనుంది.

Read Also : Pixel 7a Series : ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 7a సిరీస్ సేల్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే? 5 కారణాలివే..!

రియల్‌మి 11 Pro సిరీస్ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి 11 Pro+ మోడల్ మెటల్ ఫ్రేమ్, లగ్జరీ ప్లెయిన్ లెదర్ బ్యాక్ ఉన్నాయి. 6.7-అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఫుల్ HD+ AMOLEDతో రానున్నాయి. డిస్ప్లే 5000000:1 కాంట్రాస్ట్ రేషియో, 100 శాతం DCI-P3 కలర్ గామట్‌తో 1.07 బిలియన్ కలర్లను ప్రదర్శించగలదు. హుడ్ కింద.. ఫోన్ MediaTek Dimensity 7050 చిప్‌సెట్, Mali-G68 GPU ద్వారా పవర్ అందిస్తుంది. గరిష్టంగా 12GB RAM, 1TB స్టోరేజీని కలిగి ఉంటుంది.

iPhone 15 Price Leak Expected specifications, launch timeline, price and other details

రియల్‌మి యూజర్లు RAMని 8GB వరకు డైనమిక్‌గా విస్తరించవచ్చు. ఈ ఫోన్‌లోని ట్రిపుల్ కెమెరా సెటప్ పెద్ద వృత్తాకార శ్రేణిలో ఉంటుంది. 200MP ప్రధాన కెమెరా SuperOIS, Samsung HP3 సూపర్ జూమ్ సెన్సార్, 85-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో వస్తుంది. మిగిలిన రెండు కెమెరాలు వరుసగా 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో షూటర్. సెల్ఫీ కెమెరా 32MP, వెనుక కెమెరా 30fps వద్ద 4K వీడియోలను షూట్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా 60fps వద్ద 1080pకి పరిమితం అయింది. అదనంగా, మూన్ మోడ్, హ్యాండ్‌హెల్డ్ స్టార్రీ స్కై మోడ్ వంటి కెమెరా ఫీచర్లు ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్‌లో 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ కూడా ఉంది. రియల్‌మి 11 Pro 5G, Realme 11 Pro+కి సమానమైన డిజైన్‌ను కలిగి ఉంది. అదే 6.7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. MediaTek డైమెన్సిటీ 7050 చిప్‌సెట్, Mali-G68 GPU ద్వారా ఆధారితమైనది. గరిష్టంగా 12GB వరకు RAM, 512GB స్టోరేజీ ఆప్షన్‌తో వస్తుంది. 100MP ప్రైమరీ కెమెరాతో పాటు 67W ఛార్జింగ్ స్పీడ్ కలిగి ఉంటుంది.

Read Also : Apple iPhone 15 Price : ఆపిల్ ఐఫోన్ 15 ధర ఎంతో తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? లాంచ్ టైమ్ అప్పుడేనట..!