Realme 11 Launch Date : రూ. 20వేల ధరలో రియల్‌మి 11x సిరీస్ ఫోన్లు.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్..!

Realme 11 Launch Date : రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. రూ. 20వేల ధరలో రెండు కొత్త రియల్‌మి ఫోన్లు లాంచ్ కానున్నాయి. లాంచ్ డేట్ ఎప్పుడంటే?

Realme 11 Launch Date : రూ. 20వేల ధరలో రియల్‌మి 11x సిరీస్ ఫోన్లు.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్..!

Realme 11, Realme 11x India launch date confirmed, likely to be priced under Rs 20,000

Realme 11 Launch Date : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) ఈ నెలాఖరున Realme 11 5G, Realme 11x 5G అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. రియల్‌మి 11 5G, రియల్‌మి 11xతో పోలిస్తే.. అద్భుతమైన కెమెరా పర్ఫార్మెన్స్ అందిస్తోంది. షావోమీ Redmi 12 సిరీస్, Samsung Galaxy M14 లతో పోటీగా రెండు మోడల్‌లు భారత మార్కెట్లో రూ. 20వేల కన్నా తక్కువ ధరలో రానున్నాయి.

రియల్‌మి నెక్స్ట్ ఫోన్ సిరీస్ లాంచ్‌ని ధృవీకరించింది. రియల్‌మి 11 5G, Realme 11x 5G అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. రాబోయే రియల్‌మి ఫోన్‌లు ఈ నెలాఖరున ఆగస్టు 23న లాంచ్ అవుతాయని కంపెనీ ధృవీకరించింది. లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్‌మి వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. అదే ఈవెంట్‌లో కంపెనీ Realme Buds Air 5 Proని ఆవిష్కరించవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

Read Also : iPhone 15 Plus Launch : ఐఫోన్ 15 ప్లస్ వచ్చేస్తోంది.. సెప్టెంబర్ 12నే లాంచ్.. లిమిట్ ఛార్జింగ్ స్పీడ్, మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు..!

అధికారిక లాంచ్‌కు ముందు.. కంపెనీ ఇప్పటికే Realme 11x కొన్ని ముఖ్య స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. రియల్‌మి 11x 5G ఫోన్ 64MP ప్రైమరీ రియర్ కెమెరాతో రానుందని రియల్‌మి ధృవీకరించింది. AI ద్వారా పవర్ అందిస్తుంది. రిటైల్ బాక్స్‌లో 33W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఈ స్పెక్స్‌ను పరిశీలిస్తే.. 11x అనేది ఇప్పటికే తైవాన్‌లో లాంచ్ అయిన Realme 11 టోన్డ్-డౌన్ వెర్షన్ అని తెలుస్తోంది.

రియల్‌మి 11 5G భారతీయ వెర్షన్ స్పెసిఫికేషన్‌లు గ్లోబల్ మోడల్‌కు సమానంగా ఉంటాయని భావిస్తున్నారు. స్పెక్స్ విషయానికొస్తే.. Realme 11 5G 6.72-అంగుళాల FHD+ డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో రానుంది. MediaTek డైమెన్సిటీ 6100+ SoCతో పాటు 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది.

Realme 11, Realme 11x India launch date confirmed, likely to be priced under Rs 20,000

Realme 11, Realme 11x India launch date confirmed, likely to be priced under Rs 20,000

కెమెరా స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. స్మార్ట్‌ఫోన్‌లో 108MP ప్రైమరీ కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. Realme 11 బాక్స్‌లో 67W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 13 ఆధారంగా రియల్‌మీ UI 4.0తో ఫోన్ రన్ అవుతుంది. స్పెషిఫికేషన్లను పరిశీలిస్తే.. రియల్‌మి 11xతో పోల్చినప్పుడు.. రియల్‌మి 11 5G అద్భుతమైన కెమెరా పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ధర ప్రకారం.. Realme 11, Realme 11X రెండూ భారత మార్కెట్లో రూ. 20వేల కన్నా తక్కువ ధరలో ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్‌ల కచ్చితమైన ధర తెలియనప్పటికీ, రాబోయే రియల్‌మి ఫోన్‌లు షావోమీ కొత్త Redmi 12 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ M14 లకు పోటీదారుగా రానుంది.

Read Also : Tech Tips in Telugu : మీ ఆధార్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో కొత్త PVC కార్డు ఎలా పొందాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!