Realme 15 5G Series : కొత్త రియల్‌మి 15 5G సిరీస్ వచ్చేసిందోచ్.. 2 ఫోన్లలో AI కెమెరా ఫీచర్లు హైలెట్.. ధర కూడా మీ బడ్జెట్‌లోనే..!

Realme 15 5G Series : రియల్‌మి 15 5G సిరీస్ వచ్చేసింది. సరికొత్త ఏఐ ఫీచర్లతో రెండు రియల్‌మి ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.

Realme 15 5G Series

Realme 15 5G Series : రియల్‌మి ఫ్యాన్స్ కోసం సరికొత్త 5G ఫోన్లు వచ్చేశాయి. భారత మార్కెట్లో బేస్ వేరియంట్ రియల్‌మి 15, రియల్‌మి 15 ప్రో 5G ఫోన్లు లాంచ్ (Realme 15 5G Series) అయ్యాయి. ఈ రెండు ఫోన్లు ఒక్కొక్కటి 7,000mAh బ్యాటరీలతో వచ్చాయి. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి.

బేస్ మోడల్ మీడియాటెక్ డైమన్షిటీ 7300+ చిప్‌సెట్‌తో వస్తుంది. అయితే, ప్రో వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoC కలిగి ఉంటుంది. 50MP సెల్ఫీ షూటర్లు, 50MP ప్రైమరీ బ్యాక్ కెమెరాలు, AI-బ్యాక్డ్ ఇమేజింగ్ టూల్స్‌ ఉన్నాయి. రియల్‌మి 15 ప్రో ఫోన్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తాయి.

భారత్‌లో రియల్‌మి 15, 15 Pro 5G ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో రియల్‌‌మి 15 ప్రో 5G ఫోన్ 8GB + 128GB ఆప్షన్‌ ధర రూ. 31,999 నుంచి ఉంటుంది. 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GB వేరియంట్‌ల ధరలు వరుసగా రూ. 33,999, రూ. 35,999, రూ. 38,999 అందుబాటులో ఉన్నాయి. రియల్‌మి 15 5G ఫోన్ 8GB + 128GB కాన్ఫిగరేషన్ ధర రూ. 25,999, 8GB + 256GB, 12GB + 256GB వెర్షన్‌లు వరుసగా రూ. 27,999, రూ. 30,999గా ఉన్నాయి.

రియల్‌మి 15 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు రెండూ జూలై 30 నుంచి రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన బ్యాంకుల్లో రియల్‌మి 15 ప్రో 5G కొనుగోలుపై కస్టమర్లు రూ. 3వేల వరకు బ్యాంక్ ఆఫర్లను పొందవచ్చు.

రియల్‌మి 15 5Gపై రూ. 2వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. ఫ్లోయింగ్ సిల్వర్, వెల్వెట్ గ్రీన్, వెనిల్లా వేరియంట్ సిల్క్ పింక్ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. ప్రో మోడల్ సిల్క్ పర్పుల్ షేడ్‌లో పొందవచ్చు.

రియల్‌మి 15, ప్రో 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి 15 5G, రియల్‌మి 15 ప్రో 5G ఫోన్లలో 6.8-అంగుళాల 1.5K (2,800×1,280 పిక్సెల్స్) అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 2,500Hz వరకు ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 6,500 నిట్స్ వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉన్నాయి.

రియల్‌మి 15 5Gలో మీడియాటెక్ డైమన్షిటీ 7300+ చిప్‌సెట్, రియల్‌మి 15 ప్రో 5Gలో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoC ఉంది. ఈ రియల్‌మి ఫోన్‌లు 12GB వరకు LPDDR4X ర్యామ్, 512GB వరకు UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తాయి. ఆండ్రాయిడ్ 15-ఆధారిత రియల్‌మి యూఐ 6తో వస్తాయి.

Read Also : Google Photos : గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఫ్రీ AI టూల్స్.. మీ పాత ఫొటోలకు ప్రాణం పోయొచ్చు.. యానిమేట్ వీడియోలుగా మార్చొచ్చు..!

కెమెరా సెగ్మెంట్‌లో రియల్‌మి 15 ప్రో 5G బ్యాక్ సైడ్ 50MP సోనీ IMX896 ప్రైమరీ సెన్సార్‌తో పాటు 50MP అల్ట్రావైడ్ షూటర్‌ను కలిగి ఉంది. రియల్‌మి 15 5Gలో 50MP సోనీ IMX882 మెయిన్ సెన్సార్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8MP సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ రియల్‌మి ఫోన్లలో 50MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. అంతేకాదు.. ఏఐ ఎడిట్ జెనీ, ఏఐ పార్టీ వంటి ఏఐ ఆధారిత ఎడిటింగ్ ఫీచర్లు ఉన్నాయి.

వాయిస్-ఎనేబుల్డ్ ఫొటో ఎడిటింగ్‌ సపోర్టు, రియల్ టైమ్‌లో షట్టర్ స్పీడ్, కాంట్రాస్ట్, సాచురేషన్ వంటి సెట్టింగ్‌ ఆటోమాటిక్‌గా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఏఐ మ్యాజిక్‌గ్లో 2.0, ఏఐ ల్యాండ్‌స్కేప్, AI గ్లేర్ రిమూవర్, AI మోషన్ కంట్రోల్, AI స్నాప్ మోడ్ వంటి ఫీచర్లకు కూడా సపోర్టు ఇస్తుంది. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఫోన్ GT బూస్ట్ 3.0 టెక్నాలజీ, గేమింగ్ కోచ్ 2.0కి కూడా సపోర్టు ఇస్తాయి.

రియల్‌మి 15 ప్రో 5G, రియల్‌మి 15 5G రెండూ ఫోన్లు 7,000mAh బ్యాటరీలతో వచ్చాయి. 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి. ఈ ఫోన్లు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో IP66+IP68+IP69 రేటింగ్‌ కలిగి ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు ఉన్నాయి.

5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C కనెక్టివిటీకి సపోర్టు ఇస్తాయి. రియల్‌మి 15 5G ఫోన్ 162.27×76.16×7.66mm సైజు, 187 గ్రాముల బరువు ఉంటుంది. రియల్‌మి 15 ప్రో 5G సిల్క్ పర్పుల్ వేరియంట్ 62.26×76.15×7.69mm కలిగి ఉండగా, ఫ్లోయింగ్ సిల్వర్, వెల్వెట్ గ్రీన్ వేరియంట్లు వరుసగా 7.79mm, 7.84mm సైజుల్లో లభ్యం కానున్నాయి.