Realme 15 Pro 5G : ట్రిపుల్ కెమెరాలతో కొత్త రియల్‌మి 5G ఫోన్ వస్తోందోచ్.. AI ఫీచర్లు మాత్రం హైలెట్ భయ్యా.. ధర ఎంత ఉండొచ్చంటే?

Realme 15 Pro 5G : రియల్‌మి 15ప్రో 5G వచ్చేస్తోంది. అతి త్వరలో రియల్‌మి 15 ప్రో 5G ఫోన్ లాంచ్ కానుంది. ధర, ఫీచర్లు, డిజైన్ ఇలా ఉన్నాయి..

Realme 15 Pro 5G

Realme 15 Pro 5G : కొత్త రియల్‌మి ఫోన్ కొంటున్నారా? అయితే, మరికొద్ది రోజులు ఆగండి.. రియల్‌మి అభిమానుల కోసం సరికొత్త 5G ఫోన్ రాబోతుంది. భారత మార్కెట్లో రియల్‌మి 15 సిరీస్ లాంచ్ కానుంది. రియల్‌మి 15 5Gతో పాటు ప్రో వెర్షన్ కూడా లాంచ్ కానుంది.

కంపెనీ ఇప్పటికే సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ ఫోన్ వివరాలను రివీల్ చేసింది. ఈ 5G ఫోన్ ఏఐ కెమెరా ఫీచర్లతో రానుంది. డిజైన్, స్పెసిఫికేషన్లు, ఇతర ఫీచర్ల పూర్తి వివరాలను రివీల్ చేయలేదు. ఇటీవలి నివేదికలో రాబోయే రియల్‌మి ఫోన్ డిజైన్ రెండర్‌లు, ఇతర వివరాలను లీక్ చేసింది.

లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. రియల్‌మి 15 ప్రో రెండు వేర్వేరు సర్కిల్‌లలో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. కెమెరా మాడ్యూల్ ప్యానెల్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో వర్టికల్‌గా అమర్చి ఉంటుంది.

అయితే, మరో సర్కిల్ స్లాట్ LED ఫ్లాష్ యూనిట్‌ కలిగి ఉండవచ్చు. అదనంగా, సిల్వర్ కలర్ ఆప్షన్ కలిగి ఉంటుంది. రియల్‌మి ఫోన్ ‘ఫ్లోయింగ్ సిల్వర్’ షేడ్‌ను కలిగి ఉంటుంది. ఇంకా, సిల్క్ పర్పుల్, వెల్వెట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో కూడా రావచ్చు.

Read Also : Samsung Galaxy S26 Ultra : కొత్త శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే కెమెరా ఫీచర్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్..!

రియల్‌మి 15 ప్రో 5G లాంచ్ టైమ్‌లైన్ :
ఈ నెల చివరిలో రియల్‌మి 15 ప్రో 5G లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, కచ్చితమైన తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

రియల్‌మి 15 ప్రో 5G స్పెసిఫికేషన్లు
రియల్‌మి 15 5G సిరీస్ AI ఫీచర్లతో వస్తుంది. ఇందులో AI ఎడిట్ జెనీ, AI పార్టీ ఉన్నాయి. రియల్‌మి ప్రో మోడల్ 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GB ర్యామ్, స్టోరేజీ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. రాబోయే ఈ హ్యాండ్‌సెట్ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు.

120Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ ఉండవచ్చు. ఆప్టిక్స్ విషయానికొస్తే.. స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 8MP సెన్సార్, 50MP సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది.

రియల్‌మి 15 ప్రో 5G ధర ఎంతంటే? :
రియల్‌మి 15 ప్రో బేస్ మోడల్ ధర దాదాపు రూ.27వేలు ఉంటుందని అంచనా.