Realme 16 5G : రియల్‌మి క్రేజే వేరబ్బా.. ఈ సెల్ఫీ మిర్రర్ 5G ఫోన్ భలే ఉందిగా.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!

Realme 16 5G : రియల్‌మి నుంచి అద్భుతమైన 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ బ్యాటరీనే హైలెట్. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సింగిల్ ఛార్జ్ చేస్తే 2 రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది.

Realme 16 5G Sale

  • భారత మార్కెట్లో రియల్‌మి కొత్త 5జీ ఫోన్ లాంచ్
  • 7000mAh బ్యాటరీ, రియర్ సెల్ఫీ మిర్రర్ కెమెరా ఫీచర్లు
  • ప్రీ ఆర్డర్లు, ఏప్రిల్ 5 నుంచి ఫోన్ డెలివరీ

Realme 16 5G : కొత్త రియల్‌మి ఫోన్ వచ్చేసింది. రియల్‌మి కొత్త మోడల్ రియల్‌మి 16 5జీ లాంచ్ అయింది. ఈ 5జీ ఫోన్‌లో భారీ 7,000mAh బ్యాటరీ, 60W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP పోర్ట్రెయిట్ మాస్టర్ కెమెరా, 120Hz అమోల్డ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

కంపెనీ ప్రకారం.. ఈ రియల్‌మి క్లిన్ డిజైన్‌తో స్ట్రాంగ్ బ్యాటరీ లైఫ్‌ అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. రియల్‌మి యూఐ 7.0 (ఆండ్రాయిడ్ 16)పై రన్ అవుతుంది.

ధర పరంగా పరిశీలిస్తే.. రియల్‌మి 16 5జీ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999 కాగా, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 36,999గా ఉంది. ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం కాగా ఏప్రిల్ 5న నుంచి డెలవరీ అవుతాయి. ఈ ఫోన్ ఎయిర్ వైట్ ఎయిర్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Samsung Galaxy A27 5G : శాంసంగ్ ఫ్యాన్స్ కోసం కొత్త గెలాక్సీ A27 5G వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర కూడా తక్కువే!

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి 16 5జీలో 7,000mAh బ్యాటరీతో 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్ సింగిల్ ఛార్జ్‌పై 2 రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ 4,200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.5-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కూడా ఉంది.

ఈ కెమెరా సెటప్‌లో ఫ్రంట్ సైడ్ 50MP సెన్సార్లతో పాటు బ్యాక్ సైడ్ 2MP సెకండరీ కెమెరా ఉంది. ముఖ్యంగా, రియర్ కెమెరా మాడ్యూల్‌లో సెల్ఫీ మిర్రర్ కూడా ఉంది. ఫొటోలు ఫ్రేమింగ్‌కు అద్భుతంగా ఉంటుంది. అదనంగా, ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ అనేక ఏఐ ఫీచర్లతో వస్తుంది.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే..
రియల్‌మి 16 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్ 256GB స్టోరేజ్ అందిస్తుంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ రియల్‌మి 16 5జీ ఫోన్ 8.1mm మందంతో 183 గ్రాముల బరువుతో వస్తుంది. IP69-రేటెడ్ బాడీతో వస్తుంది.

ఈ ఫోన్ బ్లూటూత్ 5.3, 5జీ, 4జీ ఎల్టీఈ, బీడౌ, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై 6 వంటి కనెక్టివిటీ ఆప్షన్లను అందిస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.