Realme 16T 5G : సింగిల్ ఛార్జ్.. 3 రోజులు బ్యాకప్.. AI కెమెరాతో రియల్‌మి 16T 5G అదుర్స్.. ధర మీ బడ్జెట్‌లోనే..!
Realme 16T 5G : రియల్‌మి కొత్త ఫోన్ 16టీ 5జీ లాంచ్ అయింది. 50MP కెమెరా, 8000mAh బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Updated on- May 23, 2026 / 02:00 PM IST
Realme 16T 5G : రియల్‌మి లవర్స్‌కు పండగే.. భారత మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లతో రియల్‌మి నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ 16T 5జీ వచ్చేసింది. రియల్‌మి 16T 5జీలో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8000mAh బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP సోనీ ఏఐ కెమెరా అమర్చారు. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 ప్రో రేటింగ్ అందిస్తుంది. రియల్‌మి 16టీ 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వరకు పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
రియల్‌మి 16టీ 5జీ ధర :
రియల్‌మి 16టీ 5జీ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999, 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999గా నిర్ణయించారు.
ఈ ఫోన్ ప్రీ-సేల్ మే 26న ముగుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మే 27న అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌పై రూ. 3వేలు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.
రియల్‌మి 16టీ 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
రియల్‌మి 16టీలో 144Hz రిఫ్రెష్ రేట్, 90.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, హై-బ్రైట్‌నెస్ మోడ్‌లో 1,200 నిట్స్ వరకు 6.8-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7పై రన్ అవుతుంది.
ఇందులో స్ప్లిట్-స్క్రీన్ మల్టీటాస్కింగ్, ఫ్లోటింగ్ విండోస్, స్క్రీన్ రికార్డింగ్, ఒప్పో షేర్, ఐఓఎస్ ఫైల్ షేరింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్ అందిస్తుంది. మిలిటరీ-గ్రేడ్ షాక్-రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. హీట్ మేనేజ్ మెంట్ కోసం వేపర్ ఛాంబర్, గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ ఉపయోగించారు. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ కెపాసిటివ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. రియల్‌మి 16Tలో ఫ్రంట్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్, ఆటోఫోకస్ సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, రియర్ సైడ్ ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందించారు.
కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, VoWiFi, బ్లూటూత్ 5.3, IPv6, జీపీఎస్, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. రియల్‌మి 16టీకి 8,000mAh బ్యాటరీ పవర్ అందిస్తుంది. 45W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కొలతల పరంగా, ఈ ఫోన్ 166.47mm పొడవు, 78.23mm వెడల్పు, 8.88mm మందం, 224 గ్రాముల బరువు ఉంటుంది.
