Realme GT 7 Discount : పండగ చేస్కోండి.. ఈ రియల్‌మి GT 7పై బిగ్ డిస్కౌంట్.. భారీ బ్యాటరీతో ఇంత తక్కువకే వస్తుంటే కొనాల్సిందే..!

Realme GT 7 Discount : అద్భుతమైన ఆఫర్.. రియల్‌మి GT 7 భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ అదిరే డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..

Realme GT 7 Discount

Realme GT 7 Discount : రియల్‌మి లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. 7,000mAh బ్యాటరీతో బిగ్ ఫోన్ కావాలా? అయితే, మీకోసం అమెజాన్‌లో రియల్‌మి GT 7 5G ఫోన్‌ (Realme GT 7 Discount) అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ 5G ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ కొనుగోలుపై అనేక ఆఫర్లు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లను పొందవచ్చు. ఇంతకీ తగ్గింపు ధరకే రియల్‌మి GT 7 ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కొత్త ధర, డిస్కౌంట్ ఆఫర్లు :
ఈ రియల్‌మి GT 7 ఫోన్ ధర విషయానికి వస్తే.. 3 వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ధర రూ. 45,999కు పొందవచ్చు. అమెజాన్ నుంచి 13శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత రియల్‌మి GT 5G ధర రూ. 39,999కి పొందవచ్చు.

అయితే, ఈ ధరను మరింత తగ్గించవచ్చు. బ్యాంక్ ఆఫర్ కింద అన్ని బ్యాంక్ కార్డులపై రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడంపై రూ. 37,999 డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 1939 ఈఎంఐ ఆప్షన్‌పై కూడా కొనుగోలు చేయొచ్చు.

Read Also : Power Bank Guide : కొత్త పవర్ బ్యాంక్ కొంటున్నారా? ముందుగా ఈ 7 విషయాలను తప్పక గుర్తుంచుకోండి..!

రియల్‌మి GT 7 5G స్పెసిఫికేషన్లు :
డిస్‌ప్లే : ఈ రియల్‌మి ఫోన్ 6.78-అంగుళాల డిస్‌ప్లేతో 2780×1264 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఉంది. బ్రైట్‌నెస్ గరిష్టంగా 6000 నిట్స్ చేరుకుంటుంది.

పర్ఫార్మెన్స్ : ఈ మొబైల్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. అదే సమయంలో, ఆర్మ్ ఇమ్మోర్టాలిస్-G720 GPU గ్రాఫిక్స్‌ను కలిగి ఉంది.

కెమెరా ఫీచర్లు : ఫొటో, వీడియోగ్రఫీ కోసం ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ 50MP IMX906 మెయిన్ సెన్సార్ ఉంది. కానీ, ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో చాటింగ్ కోసం 32MP కెమెరా కలిగి ఉంది.

బ్యాటరీ : ఈ ఫోన్ 7,000mAh పవర్ బ్యాటరీని కలిగి ఉంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుంది. కేవలం అరగంటలోపు పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. సేఫ్టీ విషయానికి వస్తే.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.