Power Bank Guide : కొత్త పవర్ బ్యాంక్ కొంటున్నారా? ముందుగా ఈ 7 విషయాలను తప్పక గుర్తుంచుకోండి..!

Power Bank Guide : పవర్ బ్యాంక్ కొనుగోలు చేసే ముందు మీ డివైజ్‌లకు సపోర్టు చేసేలా ఉందా? వోల్టేజ్, క్వాలిటీ, ఇతర స్పెసిఫికేషన్లు చెక్ చేయాలి.

Power Bank Guide : కొత్త పవర్ బ్యాంక్ కొంటున్నారా? ముందుగా ఈ 7 విషయాలను తప్పక గుర్తుంచుకోండి..!

Power Bank Guide

Updated On : July 6, 2025 / 5:46 PM IST

Power Bank Guide : పవర్ బ్యాంకు కొనేందుకు చూస్తున్నారా? ప్రస్తుత రోజుల్లో దూర ప్రయాణ సమయాల్లో పవర్ బ్యాంకు అవసరం ఎక్కువగా పడుతుంది. స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ (Power Bank Guide) లేని సమయంలో పవర్ బ్యాంకులు ఉపయోగపడతాయి. అయితే, అన్ని పవర్ బ్యాంకులు క్వాలిటీగా ఉండవు.

కొన్నిసార్లు మీ డివైజ్ సపోర్టు చేయకపోతే ఛార్జ్ చేయలేవు. పైగా మీ డివైజ్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే, రోజువారీ ఉపయోగం కోసం ఏదైనా పవర్ బ్యాంకు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

వోల్టేజ్ అవుట్‌పుట్ :
చాలా డివైజ్‌లకు ఛార్జ్ చేసేందుకు ప్రత్యేక వోల్టేజ్ ఉంటుంది. ఇటీవలి స్మార్ట్‌ఫోన్‌లకు 5 వోల్ట్‌ల వద్ద ఉంది. అయితే, కొన్ని ఫోన్‌లకు అధిక వోల్టేజ్ కూడా అవసరం. అయితే, అన్ని పవర్ బ్యాంకులు మారుతున్న వోల్టేజ్‌కు అనుకూలంగా ఉండవు.

పవర్ బ్యాంక్ అందించే వోల్టేజ్ తక్కువగా ఉంటే డివైజ్ ఛార్జ్ చేయలేదు. అందుకే, పవర్ బ్యాంక్ కొనే ముందు సపోర్టు చేస్తుందో లేదో చెక్ చేయాలి. మీ డివైజ్ ఛార్జర్ వోల్టేజ్, పవర్ బ్యాంక్ వోల్టేజ్ రెండింటినీ చెక్ చేయాలి.

ఛార్జ్ కెపాసిటీ :
పవర్ బ్యాంక్ అనేది మీ స్మార్ట్‌ఫోన్‌ను 0 నుంచి 100 శాతం వరకు పూర్తిగా రెండుసార్లు లేదా మూడుసార్లు ఛార్జ్ చేయగలగాలి. మీ ఫోన్ సామర్థ్యాన్ని ఆన్‌లైన్‌లో లేదా ఫోన్ సెట్టింగ్స్ నుంచి చెక్ చేయాలి. మిల్లీయాంపియర్-గంటలో (mAh) సామర్థ్యం ఉంటుంది. రెట్టింపు లేదా 3 రెట్లు ఎక్కువ సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవాలి. 4,000mAh ఉన్న ఫోన్ కోసం కనీసం 8,000mAh సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంక్‌ అవసరం.

సేఫ్టీ :
అన్ని పవర్ బ్యాంకులు మీ డివైజ్‌లకు సేఫ్టీ అందించలేవు. అన్‌సేఫ్ పవర్ బ్యాంక్ ఓవర్ ఛార్జింగ్‌కు కారణమవుతుంది. మీ డివైజ్ బ్యాటరీలను దెబ్బతీస్తుంది. పవర్ బ్యాంక్‌ను కొనుగోలు చేసే ముందు మీ అవసరాలకు తగిన ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేయాలి. పవర్ బ్యాంక్ ఓవర్-ఛార్జింగ్ నుంచి సెల్ఫ్ కంట్రోల్ చేసేలా ఉండాలి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ను ప్రొటెక్ట్ చేయాలి. షార్ట్ సర్క్యూట్ రిస్క్ ఉండకూడదు. అలాంటి పవర్ బ్యాంకు ఎంచుకోవాలి.

Read Also : Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇలా పెట్టుబడి పెడితే కేవలం 115 నెలల్లోనే మీ డబ్బు డబుల్ అవుతుంది..!

బ్యాటరీ టైప్ :
పవర్ బ్యాంక్‌లో బ్యాటరీ టైప్ కావచ్చు. కొన్ని లో-రేంజ్ పవర్ బ్యాంక్‌లు లో-క్వాలిటీ గల బ్యాటరీ సెల్‌లను కలిగి ఉండవచ్చు. బ్యాటరీ లీకేజీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేదా పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ (BIS) సర్టిఫైడ్ లిథియం పాలిమర్ లేదా లిథియం అయాన్ సెల్ ఉన్న పవర్ బ్యాంక్ మాత్రమే ఎంచుకోండి. ఈ బ్యాటరీలతో కూడిన పవర్ బ్యాంక్‌లు కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంటాయి.

నెంబర్, ఛార్జింగ్ పోర్టు టైప్ :
ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లను ఛార్జ్ చేసే పవర్ బ్యాంకు కీలకం. కొన్ని పవర్ బ్యాంకులు సింగిల్ ఛార్జింగ్ పోర్ట్‌తో ఉంటాయి. ఒకేసారి ఒకే డివైజ్ మాత్రమే ఛార్జ్ చేయవచ్చు. పోర్ట్‌లు మరో ఛార్జర్ టైప్ కూడా సపోర్టు చేయొచ్చు. పవర్ బ్యాంక్ మీ అవసరాలకు సరిపోతుందో లేదో ప్రొడక్టు వివరాలను తెలుసుకోండి. పోర్ట్ సంఖ్య, టైప్ సపోర్టు చేస్తుందో లేదో చెక్ చేయండి.

నిర్మాణ క్వాలిటీ :
పవర్ బ్యాంక్ నిర్మాణ క్వాలిటీ సేఫ్టీ, లాంగ్ బ్యాటరీ లైఫ్ రెండింటికీ బెస్ట్. క్వాలిటీ గల మెటీరియల్‌తో దృఢంగా ఉండాలి. పవర్ బ్యాంకు కేసు హై-క్వాలిటీ ప్లాస్టిక్ లేదా అల్యూమినియం అయి ఉండాలి. ఇంటర్నల్ పార్టులపై దుమ్ము చేరకుండా ఉంటుంది. పవర బ్యాంకు ఎక్కువ కాలం సురక్షితంగా ఉంటుంది.

పవర్ ఇండికేటర్ :
పవర్ బ్యాంక్‌లోని పవర్ ఇండికేటర్ ఛార్జ్ చేసే ముందు పవర్ మొత్తాన్ని అంచనా వేస్తుంది. ఛార్జ్ సమయంలో పవర్ బ్యాంక్ ఎంత పవర్ ఉంది? పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు ఎంత సమయం పడుతుందో అంచనా వేస్తుంది. బ్యాటరీ పర్సెంట్ సూచించే చిన్న స్క్రీన్ కూడా ఉంది. పవర్ బ్యాంక్‌ ఓవర్ ఛార్జ్ కాకుండా ఈ ఇండికేటర్ అలర్ట్ చేస్తుంది.