×
Ad

Realme GT 8 Pro : కొత్త రియల్‌మి జీటీ 8 ప్రో వచ్చేస్తోంది.. ఈ నెల 20నే లాంచ్.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?

Realme GT 8 Pro : కొత్త రియల్‌మి జీటీ 8 ప్రో లాంచ్ కాబోతుంది. ఈ నెల 20న భారత మార్కెట్లో రిలీజ్ కానుంది. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.

Realme GT 8 Pro

Realme GT 8 Pro : కొత్త రియల్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్‌మి నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రియల్‌మి జీటీ 8 ప్రో వచ్చేస్తోంది. ఈ నెల మూడో వారంలో లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఈ రియల్‌మి ఫోన్ స్పెషల్ మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయింది. కొన్ని కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ధృవీకరించింది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 SoC చిప్‌సెట్, 2K రిజల్యూషన్ డిస్‌ప్లే, 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,000mAh బ్యాటరీ వంటివి ఉన్నాయి.

ఈ రియల్‌మి ఫోన్ ఎక్స్ఛేంజబుల్ కెమెరా ప్యానెల్ (Realme GT 8 Pro) కూడా కలిగి ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. అంతేకాదు.. ఆసక్తిగల వినియోగదారులు బ్యాక్ కెమెరా మాడ్యూల్ కూడా పొందవచ్చు. రాబోయే రియల్‌మి జీటీ 8 ప్రో ఫీచర్లు, కీలక స్పెషిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రియల్‌మి జీటీ 8 ప్రో భారత్ లాంచ్ తేదీ :
రియల్‌మి జీటీ 8 ప్రో నవంబర్ 20న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ రియల్‌మి ఫోన్ నవంబర్ చివరి నాటికి అమ్మకానికి వస్తుందని, రియల్‌మి ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ఇతర రిటైల్ ఛానల్ పార్టనర్లలో అందుబాటులో ఉంటుందని అంచనా.

Read Also : Flipkart Sale 2025 : వివో V30 ప్రోపై కిర్రాక్ ఆఫర్.. 50MP సెల్ఫీ కెమెరానే హైలెట్.. ఈ 5G ఫోన్ ఎందుకు కొనాలంటే?

రియల్‌మి GT 8 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా) :

రియల్‌మి జీటీ 8 ప్రో ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో 6.79-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ ప్యానెల్ కలిగి ఉంది. 7,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉండవచ్చు. ఈ రియల్‌మి క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ కలిగి ఉంది. LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ రియల్‌మి 7,000mm స్టీమ్ చాంబర్ (VC) కూలింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉండవచ్చు. ఈ రియల్‌మి 7,000mAh బ్యాటరీ, 120W వైర్డ్ ఛార్జింగ్ ద్వారా సపోర్టు ఇస్తుంది. డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఈ రియల్‌మి IP68, IP66, IP69 రేటింగ్ పొందవచ్చు.

కెమెరా విషయానికొస్తే.. ఈ రియల్‌మి ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉండవచ్చు. రికో జీఆర్ ఇమేజింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ రియల్‌మి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP డ్-యాంగిల్, 50MP అల్ట్రావైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 200MP పెరిస్కోప్ లెన్స్‌ పొందవచ్చు. ఫ్రంట్ సైడ్ ఈ రియల్‌మి 32MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉండవచ్చు.

రియల్‌మి GT 8 ప్రో భారత్ ధర (అంచనా) :
రియల్‌మి GT 8 ప్రో బేస్ ట్రిమ్ ధర దాదాపు రూ.65వేలు ఉంటుందని అంచనా. అయితే, ప్రస్తుతానికి ఈ ఫోన్ వివరాలు రివీల్ కాలేదు. మరిన్ని ఫీచర్లు తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి ఉండాల్సిందే..