Realme Narzo 80 Lite 5G
Realme Narzo 80 Lite 5G : రియల్‌మి లవర్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో భారత మార్కె్ట్లోకి రియల్‌మి నుంచి సరికొత్త నార్జో 80 లైట్ 5G ఫోన్ వస్తోంది. గత ఏప్రిల్‌లో కంపెనీ (Realme Narzo 80 Lite 5G) నార్జో 80x, నార్జో 80 ప్రో మోడల్స్ లాంచ్ చేసింది.
తాజాగా రియల్‌మి నార్జో 80 లైట్ డిజైన్, బ్యాటరీకి సంబంధించిన వివరాలను కంపెనీ రివీల్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు. రియల్‌మి నార్జో 80 లైట్ 5G ఫోన్ వివరాలు ఈ-కామర్స్ అమెజాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 10వేల ధర లోపు ఉండవచ్చు. బ్యాక్ కెమెరా మాడ్యూల్‌లో రెండు కెమెరాలు, ఎలిప్టికల్ LED ఫ్లాష్ యూనిట్ కలిగి ఉంది. రైట్ కార్నర్‌లో పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు బ్లాక్, పర్పల్ కలర్ అందుబాటులో ఉంటాయి. 6,000mAh బ్యాటరీతో నార్జో 80 లైట్ 5Gకి పవర్ అందిస్తుంది. 15.7 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్, 46.6 గంటల కాల్స్‌ను అందుకోనుంది.
రివర్స్ ఛార్జింగ్ సపోర్టు :
రియల్‌మి ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ రివర్స్ ఛార్జ్ చేయగలదు. నార్జో 80 లైట్ 5G 7.94mm మందం ఉంటుంది. డిజైన్ పరంగా రియల్‌మి నార్జో 80x 5G పోలి ఉంటుంది. రియల్‌మి నార్జో 80x 5G ఫోన్ 6,000mAh బ్యాటరీని 45W సూపర్‌వూక్ ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. రియల్‌మి నార్జో 80 ప్రో 5Gలో 80W సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6,000mAh బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7.55mm మందం కలిగి ఉంది.
ఇటీవలి లీక్ ప్రకారం.. రియల్‌మి నార్జో 80 లైట్ 5G 4GB ర్యామ్, 128GB స్టోరేజీ, 6GB + 128GB అనే 2 వేర్వేరు సెటప్‌లలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వెర్షన్‌లు వరుసగా రూ. 9,999, రూ. 11,999కు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మి HD+తో డిస్‌ప్లే ఉండవచ్చు. మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్ మరింత పవర్ అందిస్తుంది. 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెట్ ఉండవచ్చు.
భారత్ సహా ఇతర దేశాలలో రియల్‌మి GT 7, రియల్‌మి GT 7T ఫోన్లను లాంచ్ చేసింది. కంపెనీ కొత్త GT సిరీస్ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో మీడియాటెక్ డైమన్షిటీ చిప్‌సెట్ ఉంటుంది. 120W వద్ద ఛార్జ్ చేయగల 7,000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్‌లలో GT 7 డ్రీమ్ ఎడిషన్ కూడా కంపెనీ రిలీజ్ చేసింది.