స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ భారత్‌లో రెండు కొత్త నార్జో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. ఈ విషయంపై రియల్‌మీ అధికారికంగా ప్రకటన చేసింది. రియల్‌మీ నార్జో 80 ప్రో 5G, నార్జో 80x 5G వచ్చే వారం భారత్‌లో లాంచ్ కానున్నాయి.
రియల్‌మీ నార్జో 80 ప్రో 5G ధర రూ. 20,000లోపు ఉంటుంది. ఇక రియల్‌మీ నార్జో 80x 5G ధర రూ.12,999 ఉండొచ్చు. నార్జో 80 సిరీస్ ఫోన్‌ల రెండింటి ధరలను ఎక్స్‌లో ఆ కంపెనీ అధికారికంగా తెలిపింది.
రియల్‌మీ నార్జో 80 సిరీస్ భారత్‌లో ఏప్రిల్ 9న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఆ తర్వాత ఈ రెండు ఫోన్‌లు అమెజాన్‌తో పాటు realme.com, దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.
రియల్‌మీ నార్జో 80 ప్రో 5G ఫీచర్లు
రియల్‌మీ నార్జో 80 ప్రో 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoCతో వస్తుంది. ఈ చిప్‌తో రూ. 20,000 లోపు ధరలోనే వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇది. రియల్‌మీ నార్జో 80 ప్రో 5Gలో 6050mm² VC కూలింగ్ సిస్టమ్, 80W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీ సామర్థ్యంతో విడుదల కానుంది. 7.5mm మందం, కేవలం 179 గ్రాముల బరువుతో ఈ స్మార్ట్‌ఫోన్ ఉంది.
రియల్‌మీ నార్జో 80x 5G ఫీచర్లు
రియల్‌మీ నార్జో 80x డైమెన్సిటీ 6400 SoCతో వస్తుంది. వెనుక భాగంలో స్పీడ్ వేవ్ ప్యాటర్న్ డిజైన్ ఉంది. IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో ఇది విడుదల కానుంది. నార్జో 80x 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000mAh.
Gaming beasts, this one’s for you! 👾
The #realmeNARZO80Pro5G dominates with a 780K+ AnTuTu score, MediaTek Dimensity 7400, and segment’s largest VC cooling – all under ₹20K! Plus, students get exclusive benefits of up to ₹1,299/- during the first sale period!
Live &… pic.twitter.com/x7BUMlnxO6
— realme narzo India (@realmenarzoIN) April 1, 2025