Realme Narzo 90 5G
Realme Narzo 90 5G : రియల్‌మి ఫ్యాన్స్ మీకోసమే.. రియల్‌మి నుంచి సరికొత్త రియల్‌మి నార్జో 90 సిరీస్ వచ్చేసింది. భారత మార్కెట్లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో నార్జో 90x, నార్జో 90 లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్‌లు 144Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే కలిగి ఉన్నాయి. వినియోగదారులకు సున్నితమైన స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
ఈ రెండు రియల్‌మి ఫోన్‌లు 50MP మెయిన్ కెమెరా కలిగి ఉన్నాయి. కంపెనీ హ్యాండ్‌సెట్‌లలో పవర్‌ఫుల్ 7000mAh బ్యాటరీని అందించింది. ఫస్ట్ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు భారీ తగ్గింపుతో లభిస్తాయి. రూ. 13,999 నుంచి ధర ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌లు మల్టీ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి.
రియల్‌మి నార్జో 90x బిగ్ స్క్రీన్ :
ఈ రియల్‌మి ఫోన్ 6.8-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. VC కూలింగ్‌తో వచ్చే మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ వీసీ కూలింగ్ అంటే గేమింగ్ సమయంలో కూడా ఫోన్ వేడెక్కదు.
రియల్‌మి ఫోన్ స్పెషల్ ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB వరకు ర్యామ్, 10GB వరకు డైనమిక్ ర్యామ్‌తో వస్తుంది. డైనమిక్ ర్యామ్ అంటే.. ఫోన్ అవసరమైనప్పుడు స్టోరేజీలో కొంత భాగాన్ని ర్యామ్‌గా వాడేసుకుంటుంది. పర్ఫార్మెన్స్ మరింత అప్‌గ్రేడ్ వస్తుంది.
AI ఎడిట్ జెనీ హైలెట్ ఫీచర్ :
కెమెరాల విషయానికొస్తే.. రియల్‌మి నార్జో 90xలో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. ఇందులో ఏఐ ఎడిట్ జెనీ కూడా ఉంది. మీ ఫొటోలను అప్‌గ్రేడ్ చేయడంలో సాయపడుతుంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ IP69 రేటింగ్‌తో కూడా వస్తుంది.
స్లిమ్ స్టైలిష్ ఆప్షన్లు :
రియల్‌మి నార్జో 90 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.57-అంగుళాల FHD+ అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 6400 మ్యాక్స్ 5G చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. భారీ 6050mm² ఎయిర్‌ఫ్లో వీసీ కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో వస్తుంది. కేవలం 7.79mm మందం ఉంటుంది.
మొత్తం 3 కెమెరాలు :
50MP ప్రైమరీ రియర్ కెమెరా, 2MP సెకండరీ కెమెరా కలిగి ఉంది. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ AI ఎడిట్ జెనీ, AI స్నాప్ మోడ్, AI ల్యాండ్‌స్కేప్, AI ఎరేజర్ AI స్మార్ట్ ఇమేజ్ మాస్టరింగ్ వంటి అనేక AI ఫీచర్లతో వస్తుంది.
ఈ రెండు ఫోన్‌లు భారీ 7000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి. అదనంగా, రియల్‌మి నార్జో 90x 6.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌తో వస్తుంది.
ఈ ఫోన్‌లో సింగిల్ బాటమ్-పోర్టెడ్ స్పీకర్ కూడా ఉంది. రెండు ఫోన్లు సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతాయి. ఈ రెండు రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మి UI 6.0పై రన్ అవుతాయి. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుబాటులో ఉంటాయి.
ఫోన్, ఇతర ఫీచర్లు :
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలోని కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.3, GPS, GLONASS, గెలీలియో, QZSS, USB టైప్-C ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
రియల్‌మి నార్జో 90x 5G ధర :
ఈ రియల్‌మి ఫోన్ 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999, 8GB + 128GB వేరియంట్ ధర రూ. 15,499. ఈ రియల్‌మి ఫోన్ డిసెంబర్ 23న అమ్మకానికి వస్తుంది.
రియల్‌మి నార్జో 90 5G ధర :
ఈ రియల్‌మి ఫోన్ 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999, 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,499కు పొందవచ్చు. ఈ రియల్‌మి ఫోన్ డిసెంబర్ 24 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్ :
రియల్‌మి నార్జో 90X ఫస్ట్ సేల్ సమయంలో రూ. 2వేల బ్యాంక్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. రియల్‌మి నార్జో 90 కూడా రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లలో realme.com, అమెజాన్ నుంచి కొనుగోలు చేయొచ్చు.