Realme Narzo N53 Price : కొత్త ఫోన్ కావాలా? రియల్‌మి నార్జో N53 ఫోన్ ధర తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ మిస్ చేసుకోవద్దు..!

Realme Narzo N53 Price : రియల్‌మి నార్జో N53 ఫోన్ ఇప్పుడు రూ.10,999కి బదులుగా రూ.9,845కి అందుబాటులో ఉంది. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ అద్భుతమైన డీల్‌ని పొందవచ్చు. రియల్‌మి నార్జో N53 ధర ఇ-కామర్స్ సైట్‌లో 10శాతం తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

Realme Narzo N53 price drops with a 10 Percent discount, Check the offer now on Flipkart

Realme Narzo N53 Price : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి (Realme) నుంచి (Realme Narzo N53) లాంచ్‌తో రియల్‌మే నార్జో స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత మార్కెట్లో విస్తరించింది. ఈ హ్యాండ్‌సెట్ బడ్జెట్ కేటగిరీ ఫోన్ కాగా.. యునిసోక్ ప్రాసెసర్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫ్రంట్ సైడ్ 8MP కెమెరాను కూడా కలిగి ఉంది.

రియల్‌మి నార్జో N53 ధర ఎంతంటే? :
రియల్‌మి నార్జో N53 రెండు RAM మోడళ్లలో అందిస్తుంది. 4GB, 6GB 64GB, 128GB స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. 4GB RAM వేరియంట్ ధర రూ. 8,999, అయితే 6GB RAM రూ. 10,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ Realme.com, Amazon ద్వారా అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు నార్జో 53 ఫెదర్ గోల్డ్, ఫెదర్ బ్లాక్ రెండు కలర్ వేరియంట్‌ల నుంచి ఎంచుకోవచ్చు. కంపెనీ HDFC బ్యాంక్ కార్డ్‌లతో ఫోన్ కొనుగోలుపై రూ. 1,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

Read Also : Apple iPhone 15 Launch Event : ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్ ఈవెంట్ డేట్ తెలిసిందోచ్.. కొత్త ఐఫోన్లతో పాటు మరెన్నో ప్రొడక్టులు.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

రియల్‌మి నార్జో N53 ఫీచర్లు :
రియల్‌మి నార్జో N53 ఫోన్ 6.74-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌తో వస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 90.3 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను అందిస్తుంది. ఇతర డిస్‌ప్లే ఫీచర్‌లలో 80Hz టచ్ శాంప్లింగ్ రేట్, 450నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఫ్రంట్ హౌసింగ్ ఫ్రంట్ కెమెరా వద్ద వాటర్ డ్రాప్ నాచ్ ఉంది.

Realme Narzo N53 price drops with a 10 Percent discount, Check the offer now on Flipkart

సరికొత్త రియల్‌మి స్మార్ట్‌ఫోన్ Unisoc T612 SoC చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ లేయర్‌తో కంపెనీ సొంత Realme UI 4.0 కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుంది. పైన చెప్పినట్లుగా, రియల్‌మి నార్జో N53 ఫోన్ 4GB+64GB, 6GB+128GB అనే రెండు మోడళ్లలో వస్తుంది.

ఈ ఫోన్ 12GB వరకు డైనమిక్ RAM సపోర్టును కలిగి ఉంది. స్టోరేజీ విస్తరించడానికి మైక్రో SD కార్డ్ స్లాట్‌తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ ఫ్రంట్ సైడ్ 8MP కెమెరాను కలిగి ఉంది. వెనుక వైపున, రియల్‌మి నార్జో N53 ఫోన్ f/1.8 ఎపర్చరు, 5P లెన్స్, LED ఫ్లాష్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ అందుబాటులో ఉన్న కెమెరా ఫీచర్లలో 50MP మోడ్, నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, ఎక్స్‌పర్ట్, టైమ్‌లాప్స్, పోర్ట్రెయిట్ మోడ్, HDR, AI సీన్ రికగ్నిషన్, స్లో మోషన్, బోకె ఎఫెక్ట్ కంట్రోల్ ఉన్నాయి.

Read Also : Realme C51 Launch Offer : రూ. 10వేల లోపు ధరలో ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో రియల్‌మి C51 ఫోన్.. సెప్టెంబర్ 4నే లాంచ్