×
Ad

Realme P4 Power : భారీ 10,001mAh బ్యాటరీతో రియల్‌మి P4 పవర్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే, మీ బడ్జెట్‌ ధరలోనే..!

Realme P4 Power : రియల్‌మి P4 పవర్ వచ్చేసింది. ఈ మిడ్-రేంజ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. భారీ 10,001mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్, హై పర్ఫార్మెన్స్ డిస్‌ప్లే ఉన్నాయి.

Realme P4 Power

  • భారీ 10001mAh బ్యాటరీతో రియల్‌మి P4 పవర్ ఫోన్ లాంచ్
  • భారత మార్కెట్లో ఈ రియల్‌మి P4 పవర్ ఫోన్ ధర రూ. 25,999
  • భారత్‌లో రియల్‌మి P4 పవర్ 5జీ ధర ఎంతంటే

Realme P4 Power : కొత్త రియల్‌మి ఫోన్ కొంటున్నారా? పవర్‌ఫుల్ బ్యాటరీతో రియల్‌మి P4 పవర్ వచ్చేసింది. ఈ రియల్‌మి ఫోన్ అద్భుతమైన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా భారత మార్కెట్లోకి వచ్చింది. అంతేకాదు.. అతిపెద్ద బ్యాటరీని అందిస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్, హై పర్ఫార్మెన్స్ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ అద్భుతమైన ఫోన్ ఎలా పొందాలంటే?

రియల్‌మి P4 పవర్ ఫీచర్లు, భారీ బ్యాటరీ :
రియల్‌మి P4 పవర్ ఫోన్ భారీ 10,001mAh బ్యాటరీతో వస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై 1.5 రోజుల వరకు బ్యాటరీ పవర్ అందిస్తుంది. రియల్‌మి 185.7 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 32.5 గంటల యూట్యూబ్ స్ట్రీమింగ్, 90fps వద్ద 11.6 గంటల బీజీఎంఐ గేమింగ్, 72.3 గంటల వాయిస్ కాల్స్ కోసం అదిరిపోయే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 5-స్టార్ రేటింగ్‌ కూడా పొందింది. ప్రపంచంలోనే ఫస్ట్ 10,000mAh ప్లస్ బ్యాటరీని అందిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 4 ఏళ్లలోపు బ్యాటరీ హెల్త్ 80శాతం కన్నా కంటే తక్కువగా ఉంటే అందులోనూ ఫస్ట్ సేల్ యూనిట్లకు బ్రాండ్ ఫ్రీ బ్యాటరీ రిప్లేస్ అందిస్తోంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ బరువు 218 గ్రాములు మాత్రమే. ఈజీ పోర్టబుల్‌ ఆప్షన్ కూడా అందిస్తుంది.

రియల్‌మి P4 పవర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :

డిజైన్ పరంగా రియల్‌మి P4 ఫోన్ అద్భుతంగా ఉంది. బ్యాక్ సైడ్ బంప్ కెమెరా మాడ్యూల్‌ ఉంది. 50MP సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో షార్ప్ 4K వీడియో రికార్డింగ్‌ అందిస్తుంది. 8MP వైడ్-యాంగిల్ లెన్స్, ఫ్లాష్‌ ఆప్షన్ కూడా అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ 16MP ఏఐ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

Read Also : Vivo V60e 5G : వివో ఫ్యాన్స్ మీకోసమే.. 200MP కెమెరాతో వివో 5Gపై బిగ్ డిస్కౌంట్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?

రియల్‌మి P4 పవర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ, 7400 అల్ట్రా చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ పరంగా అద్భుతంగా ఉంటుంది. AnTuTu స్కోరు దాదాపు ఒక మిలియన్. హైపర్‌విజన్+ ఏఐ చిప్‌ కూడా ఉంది. రిజల్యూషన్‌ కూడా పెంచుకోవచ్చు. ఫ్రేమ్ రేట్లను స్టేబుల్ చేస్తుంది. వీడియో ప్లేబ్యాక్ ఆప్షన్ కూడా ఉంది.

డిస్‌ప్లే కూడా చాలా బాగుంది. హైపర్‌గ్లో ప్యానెల్ 144Hz రిఫ్రెష్ రేట్, 6,500 నిట్స్ టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. అద్భుతమైన విజువల్స్‌ అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. రియల్‌మి యూఐ 7.0తో రన్ అవుతుంది.

3 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. ఈ మోడల్ తక్కువ కాంతితోనూ డిస్ ప్లే బాగా కనిపిస్తుంది. ఏఐ లైట్‌మి అనే ఫీచర్, ఫొటో ఎడిటింగ్ కోసం ఏఐ స్టయిల్ మీ, మెసేజింగ్ కోసం ఏఐ స్మార్ట్ రిప్లయ్, గేమింగ్ కోసం ఎయిమ్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లతో వస్తుంది.

భారత్‌లో రియల్‌మి P4 పవర్ 5జీ ధర ఎంతంటే? :
దేశ మార్కెట్లో రియల్‌మి P4 పవర్ 5జీ 8జీబీ ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 25,999 కాగా, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ హై-ఎండ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 27,999కు లభిస్తోంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ టాప్-ఆఫ్-ది-లైన్ రియల్‌మి P4 సిరీస్ ఫోన్ రూ. 30,999కు లభిస్తుంది.

అలాగే ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 2వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్‌‌ పొందవచ్చు. ఫిబ్రవరి 5 నుంచి భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్, కంపెనీ వెబ్‌సైట్, రిటైల్ అవుట్‌లెట్‌లలో లభ్యం కానుంది. రియల్‌మి P4 పవర్ 5G ఫోన్ ట్రాన్స్‌సిల్వర్, ట్రాన్స్‌ఆరెంజ్, ట్రాన్స్‌బ్లూ, ట్రాన్స్‌ట్రాన్సివ్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతుంది.