Realme Shutdown : వన్‌ప్లస్ బాటలో రియల్‌మి.. ఇకపై అక్కడ రియల్‌మి ఫోన్లు దొరకవు.. అసలు రీజన్ ఇదే..!

Realme Shutdown : చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి ఇప్పుడు చైనా మార్కెట్ నుంచి వైదొలగనుంది. ప్రపంచ మార్కెట్‌పైనే స్పెషల్ ఫోకస్ పెట్టబోతోంది. పూర్తి వివరాలివే..

Realme Shutdown

  • రియల్‌మి యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తోంది
  • యూరప్‌లోని నార్డిక్ ప్రాంతంపై దృష్టి సారిస్తోంది
  • చైనాలో పాత రియల్‌మి యూజర్లు ఇంకా అప్‌డేట్స్ పొందవచ్చు

Realme Shutdown : రియల్‌మి వినియోగదారులకు బిగ్ షాక్.. వన్‌ప్లస్ బాటలోనే రియల్‌మి అడుగులు వేస్తోంది. రియల్‌మి అతి త్వరలోనే తన కార్యకలాపాలను నిలిపివేయనుంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి ఇప్పుడు సొంత మార్కెట్ చైనా నుంచి నిష్క్రమిస్తోంది. ఇప్పుడంతా కంపెనీ గ్లోబల్ మార్కెట్ వైపే ఫోకస్ పెడుతోంది.

ఈ వారమే వన్‌ప్లస్ యూఎస్, యూరప్‌లలో తన కార్యకలాపాలను నిలిపివేస్తోందని ప్రకటించింది. ఇప్పుడు, రియల్‌మి కూడా చైనాలో కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు తెలుస్తోంది. రియల్‌మికి చెందిన షెన్ క్వి, రియల్‌మి చైనాలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి పూర్తిగా విదేశీ మార్కెట్లపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

నివేదిక ప్రకారం.. రియల్‌మి ఇప్పటికే యూరప్‌లోని కొన్ని ప్రాంతాలలో స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది. ఆ ప్రాంతంపైనే దృష్టి సారిస్తోంది. పేరెంట్ కంపెనీ ఒప్పో డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాల్లోని యూరప్‌లోని నార్డిక్ ప్రాంతంలో రియల్‌మి మార్కెట్ విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది.

Read Also : Motorola Edge 60 Pro : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. ఈ మోటోరోలా ఫోన్ మరి ఇంత తక్కువా? ఎలా కొనాలంటే?

కొత్త బ్రాండ్‌పై ఫోకస్ :
చైనా మార్కెట్‌లో కొంతకాలం రియల్‌మి బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయిందని కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో రియల్‌మి విదేశీ మార్కెట్లను విస్తరించడంతో పాటు పర్ఫార్మెన్స్, గేమింగ్‌పై దృష్టి పెట్టడం, కొత్త టెక్నాలజీ ప్రపంచానికి అందించడంపైనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకుంది.

పాత రియల్‌‌మి ఫోన్లలో అప్‌డేట్స్ అందుతాయి. చైనాలోని రియల్‌మి యూజర్లందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రియల్‌మి మోడళ్ల సేల్స్, అమ్మకాల తర్వాత వారంటీని ఒప్పో అధికారిక బృందం నిర్వహిస్తుంది. సిస్టమ్ అప్‌డేట్‌ల విషయానికి వస్తే.. నెక్స్ట్ జనరేషన్ కలర్‌ఓఎస్ లాంచ్ తర్వాత అప్‌డేట్ నోటిఫికేషన్ అందుకున్న వెంటనే రియల్‌మి యూజర్లు కలర్‌ఓఎస్ సిస్టమ్‌కు అప్‌డేట్ అవుతారు.