POCO C95 Pro : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. భారీ బ్యాటరీతో పోకో C95 ప్రో ఆగయా.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?
POCO C95 Pro Launch : పోకో C95 ప్రో లాంచ్ అయింది. ఈ ఫోన్లో 7,500mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, 6.9-అంగుళాల 120Hz డిస్ప్లే, హీలియో G91 అల్ట్రా ప్రాసెసర్, 50MP కెమెరా ఉన్నాయి. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..
POCO C95 Pro
- కొత్త పోకో C95 ప్రో వచ్చేసింది
- 7500mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్టు
- భారీ 6.9-అంగుళాల 120Hz డిస్ప్లే
POCO C95 Pro Launch : కొత్త పోకో ఫోన్ కొంటున్నారా? మార్కెట్లో భారీ బ్యాటరీలు, వైడ్ డిస్ప్లేలు స్మార్ట్ఫోన్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా, షావోమీ కొత్త పోకో C95 ప్రోను లాంచ్ చేసింది. లాంగ్ బ్యాటరీ లైఫ్, భారీ స్మూత్ డిస్ప్లే, రోజువారీ టాస్కుల కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోరుకునే కస్టమర్ల కోసం ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
పోకో C95 ప్రో 7,500mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ 6.9-అంగుళాల 120Hz డిస్ప్లేతో వస్తుంది. హీలియో G91 అల్ట్రా ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 50MP కెమెరా హైపర్ఓఎస్ 3 ఉన్నాయి. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పోకో ప్రో మోడల్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ సింగపూర్‌లో ఎర్లీ-బర్డ్ సేల్ (POCO C95 Pro) సమయంలో 220 డాలర్లు (సుమారు రూ. 20,918) కాగా 8GB + 256GB వేరియంట్ ధర $260 (సుమారు రూ. 24,800)గా ఉంటుంది.
పోకో C95 ప్రో డిస్ప్లే :
డిస్ప్లే విషయానికి వస్తే.. పోకో C95 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.9-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఈ హై-రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్ యానిమేషన్లు చాలా స్మూత్ కనిపిస్తాయి. అదనంగా, ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది.
Read Also : Vivo T5 Series : సూపర్ ఫోన్లు బ్రో.. వివో T5 లైట్ 5G సిరీస్ అదుర్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర చాలా చీప్..!
7,500mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్
పోకో సి95 ప్రో భారీ 7,500mAh బ్యాటరీ మెయిన్ అట్రాక్షన్. ఎక్కువ సమయం వీడియోలు చూడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, కాల్స్ చేయడం లేదా సోషల్ మీడియాను వాడే కస్టమర్లకు అద్భుతంగా ఉంటుంది. 45W వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఈ ఫోన్‌ను రోజువారీ వినియోగానికి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
పోకో C95 ప్రో పర్ఫార్మెన్స్ :
పర్ఫార్మెన్స్ పరంగా పోకో C95 ప్రో మీడియాటెక్ హీలియో G91 అల్ట్రా చిప్సెట్తో రన్ అవుతుంది. 8GB LPDDR4X ర్యామ్, 256GB eMMC 5.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ కాల్స్ చేయడం, వాట్సాప్ వాడకం, సోషల్ మీడియా బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్ మల్టీటాస్కింగ్ వంటి రోజువారీ టాస్కులను ఈజీగా చేయొచ్చు.
ఫొటోగ్రఫీ కోసం పోకో C95 ప్రో బ్యాక్ ప్యానెల్లో 50MP ప్రైమరీ కెమెరా, ఆగ్జిలరీ లెన్స్ ఉన్నాయి. ఈ కెమెరా రోజువారీ ఫొటోగ్రఫీ, పోర్ట్రెయిట్లు సోషల్ మీడియా కంటెంట్ కోసం అద్భుతంగా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్లో 8MP ఫ్రంట్ కెమెరా అమర్చారు.
కనెక్టివిటీ ఫీచర్లు :
సాఫ్ట్వేర్ పరంగా పరిశీలిస్తే.. పోకో C95 ప్రో ఫోన్ షావోమీ హైపర్ఓఎస్ 3పై రన్ అవుతుంది. ఈ ఫోన్లో పవర్ బటన్‌లోనే సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. కనెక్టివిటీ ఫీచర్లలో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్సీ ఉన్నాయి. అదనంగా, ఈ ఫోన్లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది.
