Realme V60 Pro With MediaTek Dimensity 6300 SoC, 5,600mAh Battery Launched_ Price, Specifications
Realme V60 Pro Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి వి సిరీస్ లైనప్‌లో కంపెనీ లేటెస్ట్ మోడల్‌గా చైనాలో లాంచ్ అయింది. కొత్త రియల్‌మి ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 ఎస్ఓసీపై రన్ అవుతుంది.
50ఎంపీ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ బ్యాక్ కెమెరాలను కలిగి ఉంది. రియల్‌మి వి60 ప్రో మూడు విభిన్న కలర్ ఆప్షన్లలో వస్తుంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను కలిగి ఉంది. 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
రియల్‌మి వి60ప్రో ధర ఎంతంటే? :
రియల్‌మి వి60 ప్రో, 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజీతో సీఎన్‌వై 1,599 (దాదాపు రూ. 18,600), 12జీబీ ర్యామ్+ 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర సీఎన్‌వై 1,799 (దాదాపు రూ. 21వేలు) ఉంటుంది. ప్రస్తుతం చైనాలో లక్కీ రెడ్, రాక్ బ్లాక్, అబ్సిడియన్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
రియల్‌మి వి60 ప్రో స్పెసిఫికేషన్స్ :
రియల్‌మి వి60ప్రో ఆండ్రాయిడ్ 14లో రియల్‌మి యూఐ 5తో రన్ అవుతుంది. 625నిట్స్ గరిష్ట ప్రకాశం, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల హెచ్‌డీ+ (720×1,604 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 12జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో మెమరీని 2టీబీ వరకు విస్తరించవచ్చు. అయితే, డైనమిక్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ (DRE) ఫీచర్‌ని ఉపయోగించి ర్యామ్ వర్చువల్‌గా 24జీబీ వరకు విస్తరించవచ్చు.
రియల్‌మి వి60ప్రో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, సెకండరీ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం, హ్యాండ్‌సెట్ 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌కు హై-రెస్ సర్టిఫికేషన్ కూడా ఉంది.
రియల్‌మి 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రియల్‌మి వి60 ప్రోలో 5,600mAh బ్యాటరీని కలిగి ఉంది. ఐపీ68, ఐపీ69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్, మిలిటరీ-గ్రేడ్ డ్రాప్ రెసిస్టెన్స్‌ని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కొలతలు 165.69 x 76.22 x 7.99ఎమ్ఎమ్, బరువు 196 గ్రాములు ఉంటుంది.