Realme XT Explode : కొన్న గంటకే పేలిన రియల్‌మి ఫోన్.. ట్విట్టర్‌లో ఫొటోలు వైరల్..!

రియల్ మి స్మార్ట్ ఫోన్ పేలిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో బాధిత యూజర్ ఫిర్యాదు చేశాడు. స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్‌మి (Realme XT) స్మార్ట్ ఫోన్ పేలిన ఘటనపై స్పందించింది.

Realme XT Explode : ఇటీవల స్మార్ట్ ఫోన్లు పేలుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రియల్ మి స్మార్ట్ ఫోన్ పేలిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో బాధిత యూజర్ (Sandip Kundu)  ఫిర్యాదు చేయడంతో వైరల్ అయింది. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్‌మి (Realme XT) స్మార్ట్ ఫోన్ పేలిన ఘటనపై స్పందించింది. వారం క్రితమే బాధితుడు Realme XT స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయగా.. కొద్దిగంటలకే భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనపై స్పందించిన కంపెనీ బాధితుడి అడ్రస్ వివరాలను పంపాల్సిందిగా కోరింది.

స్మార్ట్ ఫోన్ అధిక ఒత్తిడి కారణంగానే పేలిందని ఒక ప్రకటనలో వెల్లడించింది. ట్విట్టర్ యూజర్ పేలిన రియల్ మి ఫోన్ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశాడు. వాస్తవానికి ఆ ఫోన్ తన స్నేహితుడికి చెందినదిగా తెలిపాడు. మంగళవారం సాయంత్రం ఫోన్ కొనుగోలు చేసిన కొన్ని గంటలకే పేలినట్టు వెల్లడించాడు. ట్విట్టర్ లో పేలిన ఫోన్ ఫొటోలను పోస్టు చేసిన అతడు.. రియల్ మి వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేత్ ను ట్వీట్ కు ట్యాగ్ చేశాడు. దీన్ని వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని కోరాడు. పేలుడు ఘటనపై వెంటనే స్పందించిన రియల్‌మి ఇండియా ట్విట్టర్ అధికారిక సపోర్టు అకౌంట్ బాధితుడికి క్షమాపణలు తెలిపింది.


బాధిత యూజర్ కాంటాక్ట్ వివరాలను పంపాల్సిందిగా కోరింది. కొన్ని గంటల తర్వాత కంపెనీ స్పందిస్తూ.. పేలిన ఫొన్ భాగాలను తీసుకుని దగ్గరలోని అధికారిక రియల్ మి సర్వీసు సెంటర్ కు తీసుకెళ్లాల్సిందిగా సూచించింది. సర్వీసు సెంటర్‌ల్లో దెబ్బతిన్న ఫోన్ అందించిన వెంటనే తగిన పరిష్కారం చూపిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. Realme XT ఫోన్ పేలుడుకు గల కచ్చితమైన కారణాలను కంపెనీ రివీల్ చేయలేదు. ఫోన్ వారంటీపై ప్రభావం ఉందా లేదో కూడా స్పష్టత లేదు. గత ఏడాదిలోనూ Realme Xt ఫోన్ పేలిన ఘటన జరిగింది.

2019 సెప్టెంబర్ లో Realme XT స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. Realme.com వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా పలు రిటైల్ మొబైల్ స్టోర్లలోనూ ఈ మోడల్ ఫోన్ అందుబాటులో ఉంది. రియల్ మి ఎక్స్ టీ మోడల్ స్నాప్ డ్రాగన్ 712 SoC పవర్ తో వచ్చింది. 6.4 అంగుళాల సూపర్ AMOLED డిస్ ప్లే ఫీచర్ తో పాటు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఫీచర్లతో వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు