Redmi 12C Launch : భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో రెడ్‌మి 12C ఎంట్రీ లెవల్ ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?

Redmi 12C Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమీ (Xiaomi) రెడ్‌మి నోట్ 12 సిరీస్‌ (Redmi Note 12 Series)ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది.

Redmi 12C debuts with 5,000mAh battery and 50MP camera _ Details

Redmi 12C Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమీ (Xiaomi) రెడ్‌మి నోట్ 12 సిరీస్‌ (Redmi Note 12 Series)ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. లాంచ్‌కు ముందు.. కంపెనీ స్వదేశంలో ఎంట్రీ-లెవల్ ఫోన్‌ను ప్రకటించింది. చైనాలో Redmi 12C స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6.71-అంగుళాల HD+ స్క్రీన్, 5,000mAh బ్యాటరీతో వస్తుంది. రెడ్‌మి ఎంట్రీ లెవల్ ఫోన్ ఏయే ఫీచర్లతో రానుందో ఓసారి పరిశీలిద్దాం..

Redmi 12C ధర (అంచనా) :
రెడ్‌మి 12C ఫోన్ మూడు విభిన్న RAM, స్టోరేజ్ మోడల్‌లలో రానుంది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ 4GB RAM, 64GB స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర CNY699 అంటే.. భారత కరెన్సీలో ధర సుమారుగా రూ. 8,385గా ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర మోడల్‌లు 4GB RAM+128GB, ROM, 6GB RAM + 128GB ROM ఒక్కొక్కటి CNY 799, CNY 899 ధర ట్యాగ్‌తో వస్తాయి.

Read Also : Redmi Note 10T 5G : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. అదిరిపోయే బ్యాటరీతో 5G ఫోన్ లాంచ్ చేసిన రెడ్‌మీ..!!

అంటే.. వరుసగా రూ. 9,585, రూ. 10,785గా ఉండనున్నాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా జనవరి 2 నుంచి చైనాలో సేల్ ప్రారంభమవుతోంది. ఇతర దేశాలలో Redmi 12C ఫోన్ లాంచ్ ఎప్పుడు అనేది ఇంకా రివీల్ చేయలేదు.

Redmi 12C Launch : Redmi 12C debuts with 5,000mAh battery and 50MP camera

రెడ్‌మి 12C ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ (అంచనా) :
Redmi 12C (1650×720 పిక్సెల్) రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.71-అంగుళాల HD+ డిస్ప్లేతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు నాన్-స్లిప్ షేప్ కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ని అమర్చారు. హ్యాండ్‌సెట్ Mali-G52 MP2 GPUతో Helio G85 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. గరిష్టంగా 6GB LPDDR4X RAMతో వస్తుంది. 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యాన్ని అందిస్తుంది.

అయితే, ఈ స్టోరేజీని 512GB వరకు పెంచుకోవడానికి ఫోన్‌లో మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. కెమెరాల విషయానికి వస్తే.. Redmi 12C వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతో పాటు కెమెరా సెన్సార్‌, పోర్ట్రెయిట్ మోడ్, టైమ్-లాప్స్ ఫోటోగ్రఫీ, నైట్ సీన్ మోడ్ వంటి మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : 5G Ready Phones : 5G ఫోన్ కావాలా? భారత్‌లో 5G రెడీ మొబైల్ ఫోన్లు 116పైనే ఉన్నాయని తెలుసా..? 5G ఫోన్ల ఫుల్ లిస్ట్ మీకోసం..