Redmi 13C 5G Launch : రెడ్‌మి 13C 5జీ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది.. భారత్‌లో ధర కేవలం రూ. 10,999 మాత్రమే!

Redmi 13C 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ప్రీమియం డిజైన్‌తో రూ. 12వేల లోపు ధరలో కొత్త రెడ్‌మి 5జీ ఫోన్ వచ్చేసింది. రెడ్‌మి 13సి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లను ఓసారి లుక్కేయండి.

Redmi 13C 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో రూ. 12వేల లోపు ధరలో రెడ్‌మి 13సి 5జీ ఫోన్ లాంచ్ అయింది. ఈ 5జీ ఫోన్ ప్రీమియం డిజైన్‌తో వస్తుంది.

అంతేకాదు.. డివైజ్ 90హెచ్‌జెడ్ డిస్‌ప్లే, 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, మరిన్ని ఫీచర్లను కలిగి ఉంది. లావా బ్లేజ్ ప్రో 5జీ మోడల్, శాంసంగ్ గెలాక్సీ ఎం14 వంటి ఇతర 5జీ ఫోన్‌లతో పోటీపడుతుంది. కొత్తగా లాంచ్ అయిన రెడ్‌మి 13సి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Redmi 12C Discount : రూ. 7వేల కన్నా తక్కువ ధరకే రెడ్‌మి 12C ఫోన్ సొంతం చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా..!

భారత్‌లో రెడ్‌మి 13సి ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో రెడ్‌మి 13సి 5జీ బేస్ మోడల్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ రూ.10,999 ప్రారంభ ధరతో వస్తుంది. 6జీబీ + 128జీబీ మోడల్ ధర రూ. 12,499 ఉండగా, 8జీబీ+ 256జీబీ ధర రూ. 14,499 ఉంటుంది. ఈ ఫోన్ స్టార్ట్రైల్ సిల్వర్, స్టార్ట్రైల్ గ్రీన్, స్టార్లైట్ బ్లాక్తో సహా అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Redmi 13C 5G launched in India Today, price starts at Rs 10,999

రెడ్‌మి 13సి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ కొత్త రెడ్‌మి ఫోన్ 13సి 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 180హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.74-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్యానెల్ హెచ్‌డీ రిజల్యూషన్‌లో వస్తుంది. డివైజ్ ముందు భాగంలో టియర్‌డ్రాప్ నాచ్, స్క్రీన్‌పై గొరిల్లా గ్లాస్ 3 కోటింగ్‌ను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ డస్ట్, స్ప్లాష్-రెసిస్టెంట్ కూడా కలిగి ఉంది. ఈ బడ్జెట్ ఫోన్ 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. రియల్‌మి 11ఎక్స్, రియల్‌మి 11 5జీకి శక్తినిచ్చే అదే చిప్‌సెట్ కలిగి ఉంది.

ఈ రెడ్‌మి ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించి ర్యామ్‌ను 16జీబీ వరకు పొడిగించే ఆప్షన్ కూడా అందిస్తుంది. కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరా కూడా ఉంది. హుడ్ కింద, 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. రెడ్‌మి 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. అయితే, కంపెనీ ఫోన్‌తో పాటు 10డబ్ల్యూ ఛార్జర్‌ను మాత్రమే అందిస్తుంది.

రెడ్‌మి 13సి 5జీ ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇవే :

బ్రాండ్ : షావోమీ
మోడల్ : రెడ్‌మి 13సి 5జీ
విడుదల తేదీ : 6 డిసెంబర్ 2023
ఫారమ్ ఫ్యాక్టర్ : టచ్‌స్క్రీన్
బ్యాటరీ సామర్థ్యం (mAh) : 5000

డిస్‌ప్లే :
రిఫ్రెష్ రేట్ 90హెచ్‌జెడ్
రిజల్యూషన్ స్టాండర్డ్ : హెచ్‌డీ ప్లస్
స్క్రీన్ పరిమాణం (అంగుళాలు) : 6.74
రిజల్యుషన్ : 720×1600 పిక్సెల్‌లు

Redmi 13C 5G launched

హార్డ్‌వేర్ :
ప్రాసెసర్ : ఆక్టా-కోర్
ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+
ర్యామ్ : 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజీ : 128జీబీ
ఎక్స్‌ఫ్యాండబుల్ స్టోరేజీ టైప్ : మైక్రో SD

కెమెరా :
బ్యాక్ కెమెరా : 50ఎంపీ (ఎఫ్/ఎఫ్/1.8)
బ్యాక్ కెమెరాల సంఖ్య : 2
ఫ్రంట్ కెమెరా : 5ఎంపీ (ఎఫ్/ఎఫ్/2.2)

సాఫ్ట్‌వేర్ : 
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 13
స్కిన్ : ఎంఐయూఐ14

కనెక్టివిటీ :
వై-ఫై : 802.11 a/b/g/n/ac
బ్లూటూత్ వి5.30
ఛార్జర్ : యూఎస్‌బీ టైప్-C సపోర్టు
హెడ్‌ఫోన్‌లు 3.5మి.మీ

సిమ్ 1 :
సిమ్ టైమ్ : నానో-సిమ్

సిమ్ 2 :
సిమ్ టైప్ : నానో-సిమ్

Read Also : Redmi K70 Series Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 50ఎంపీ కెమెరాతో రెడ్‌మి కె70 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు