Redmi 17C : సూపర్ ఫోన్ బ్రో.. 5,160mAh బ్యాటరీతో కొత్త రెడ్‌మి 17C ఫోన్.. ధర చాలా తక్కువ..!

Redmi 17C : రెడ్‌మి 17C ఫోన్ బ్యాక్ సైడ్ 13MP సింగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరా ఉంది. పూర్తి వివరాలివే..

Redmi 17C Launched

  • రెడ్‌మి 17C ఫోన్ 6.88-అంగుళాల డిస్‌ప్లే
  • ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G81 ప్రాసెసర్‌ సెటప్
  • 5,160mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్

Redmi 17C  Review : రెడ్‌మి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెడ్‌మి నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. చైనాకు చెందిన హ్యాండ్‌సెట్ తయారీ సంస్థ రెడ్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేసింది. రెడ్‌మి 17C ఫోన్ 6.88-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హీలియో G81 ప్రాసెసర్‌తో రెడ్‌మి 17Cలో 5,160mAh బ్యాటరీ ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన రెడ్‌మి 15C స్థానంలో ఈ కొత్త మోడల్ వచ్చింది.

రెడ్‌మి 17Cలో 13MP సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్‌తో 6.88-అంగుళాల డిస్‌ప్లే ఉంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

రెడ్‌మి 17C ధర ఎంతంటే? :
చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్‌ ధర CNY 799 (సుమారుగా రూ. 11,200), 4GB + 128GB వేరియంట్‌కు CNY 899 (సుమారుగా రూ. 12,600)గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ తేదీని రెడ్‌మి ఇంకా ప్రకటించలేదు.

Read Also : Vivo X200 Discount : సూపర్ డిస్కౌంట్ బ్రో.. ఈ కొత్త వివో ఫోన్ మరి ఇంత తక్కువా..? ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు!

రెడ్‌మి 17C స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో 6.88-అంగుళాల (720 × 1,640 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz, టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz, టాప్ బ్రైట్‌నెస్ 600 నిట్స్ అందిస్తుంది. డిస్‌ప్లే TÜV రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్‌ పొందింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G81 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. రెడ్‌మి 17Cలో 13MP సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5MP ఫ్రంట్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ ఆప్షన్లలో 4G, Wi-Fi, బ్లూటూత్, జీపీఎస్, BeiDou, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని సెన్సార్లలో యాక్సిలరోమీటర్, ఇ-కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.

రెడ్‌మి 17Cలో 5,160mAh బ్యాటరీ ఉంది. 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొలతలు 171.88×77.8×8.22mm, బరువు సుమారుగా 206 గ్రాములు ఉంటుంది.