Redmi A4 5G Launch : రెడ్‌మి A4 5జీ ఫోన్ వచ్చేసింది.. ఫస్ట్ ఎంట్రీ లెవల్ ఫోన్ ఇదే.. ధర ఎంతంటే?

Redmi A4 5G Launch : రెడ్‌మి భారత మార్కెట్లో రెడ్‌మి ఎ4 5జీ ఫోన్ రూ. 8,499 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొత్తం 2 వేరియంట్‌లలో వస్తుంది.

Redmi A4 5G Launched in India

Redmi A4 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి రెడ్‌మి ఎ4 5జీ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 8,499 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ రెడ్‌మి ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఎస్ఓసీని కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌తో వచ్చిన మొట్టమొదటి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ఇదే. 5,160mAh బ్యాటరీ, 6.88-అంగుళాల హెచ్‌‌డీ+ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. ఈ రెడ్‌మి ఫోన్ ధర, వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

రెడ్‌మి ఎ4 5జీ ధర వివరాలివే :
రెడ్‌మి భారత మార్కెట్లో రెడ్‌మి ఎ4 5జీ ఫోన్ రూ. 8,499 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొత్తం 2 వేరియంట్‌లలో వస్తుంది. 4జీబీ+ 64జీబీ ధర రూ. 8,499, 4జీబీ+128జీబీ ధర రూ.9,499. నవంబర్ 27న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమయ్యే అమెజాన్, ఎంఐ. కామ్, షావోమీ రిటైల్ స్టోర్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ స్టార్రి బ్లాక్, స్పార్కిల్ పర్పుల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

రెడ్‌మి ఎ4 5జీ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
డిజైన్ డిస్‌ప్లే : ఈ ఫోన్ బ్యాక్‌సైడ్ గుండ్రని, కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఈ డిజైన్ రెడ్‌మి ఎ3 (4జీ)తో వస్తుంది. ఫ్రేమ్ ఫ్లాట్‌గా ఉంటుంది. వాల్యూమ్, పవర్ బటన్‌లు కుడి వైపున ఉన్నాయి. ఎ3 మోడల్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ పవర్ బటన్‌లో వస్తుంది. 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ ఫోన్ టాప్ ఎడ్జ్‌న ఉంటుంది.

రెడ్‌మి ఎ4 5జీ ప్రీమియం లుకింగ్ హాలో గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.88-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మృదువైన ఫ్లూయిడ్ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. గరిష్టంగా 600నిట్స్ ప్రకాశంగా ఉంటుంది. అంతేకాకుండా, డిస్‌ప్లేలో ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీ కూడా ఉంది. లో బ్లూ లైట్, టీయూవీ సిరాడియన్, ఫ్లికర్-ఫ్రీ టెక్‌ని కలిగి ఉంది.

ప్రాసెసర్ : రెడ్‌మి ఎ4 5జీ అనేది స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్‌ కలిగిన రూ. 10వేల లోపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్. ఈ విభాగంలో 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కలిగి ఉంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్, శాంసంగ్ 4ఎన్ఎమ్ ఆర్కిటెక్చర్‌పై నిర్మితమైంది. రెండు కార్టెక్స్-ఎ78 కోర్లు 2GHz వరకు, 6 కార్టెక్స్-ఎ55 కోర్లను 1.8GHz వరకు కలిగి ఉంటాయి. ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ సెగ్మెంట్-బెస్ట్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా షావోమి హైపర్ఓఎస్ అవుట్-ఆఫ్-బాక్స్, రెండు ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనుంది.

కెమెరా : రెడ్‌మి ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. డ్యూయల్-కెమెరా సెటప్ ఏఐ ఫీచర్లతో వస్తుంది. కెమెరా ఫీచర్లలో టైమ్-లాప్స్, పోర్ట్రెయిట్ మోడ్, 10ఎక్స్ జూమ్ సామర్థ్యాలు, ఫిల్మ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

బ్యాటరీ : 5,160mAh బ్యాటరీతో ఆధారితంగా పనిచేస్తుంది. రెడ్‌‌మి ఎ4 5జీ రోజంతా బ్యాటరీని అందిస్తుంది. అదనంగా, 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. 33డబ్ల్యూ ఛార్జర్, రూ. 1,999 ధరతో వస్తుంది.

Read Also : iPhone Storage Full : మీ ఐఫోన్ స్టోరేజీ ఫుల్ అయిందా? ఐఫోన్ నుంచి మ్యాక్, పీసీలకు ఫొటోలు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే?