iPhone Storage Full : మీ ఐఫోన్ స్టోరేజీ ఫుల్ అయిందా? ఐఫోన్ నుంచి మ్యాక్, పీసీలకు ఫొటోలు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే?
iPhone Storage Full : ఐఫోన్ ఫొటోలు, వీడియో డివైజ్ స్టోరేజీలో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించవచ్చు. మీ ఫొటోలను డిలీట్ చేయొద్దని భావిస్తే.. మీ ఐఫోన్ స్టోరేజీని కూడా ఖాళీ చేయాలనుకుంటే.. ఫొటోలను మీ మ్యాక్ లేదా ఇతర విండోస్ పీసీలోకి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

how to transfer photos from iPhone to Mac or PC
iPhone Storage Full : ఆపిల్ ఐఫోన్ యూజర్లు తమ డివైజ్‌లో స్టోరేజీ విషయంలో తరచుగా ఇబ్బంది పడుతుంటారు. వారి డేటాను పీసీ, మ్యాక్స్ లేదా ఎస్‌డీ కార్డ్‌ల వంటి ఇతర డివైజ్‌లలో సేవ్ చేయడం అవసరం. అయితే, ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ కావడానికి కారణం ఏమిటి? బిగ్ ఫైల్‌లు, యాప్ స్టోరేజీ, ఇతరాలు వంటి అనేక అంశాలు ఉండవచ్చు.
ఐఫోన్ ఫొటోలు, వీడియో డివైజ్ స్టోరేజీలో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించవచ్చు. మీ ఫొటోలను డిలీట్ చేయొద్దని భావిస్తే.. మీ ఐఫోన్ స్టోరేజీని కూడా ఖాళీ చేయాలనుకుంటే.. ఫొటోలను మీ మ్యాక్ లేదా ఇతర విండోస్ పీసీలోకి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఐఫోన్ నుంచి మ్యాక్‌బుక్ లేదా విండోస్ పీసీకి ఫొటోలను ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఐఫోన్ నుంచి మ్యాక్‌కు ఫొటోలను ఇంపోర్ట్ చేయండి.
- ముందుగా, యూఎస్‌బీ కేబుల్‌ని ఉపయోగించి మీ ఐఫోన్ మ్యాక్‌కు కనెక్ట్ చేయండి.
- “మీ కంప్యూటర్‌కి కనెక్ట్ చేసేందుకు అనుమతించండి” అనే ప్రాంప్ట్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- “Allow”పై క్లిక్ చేయండి. ఇప్పుడు, మీ మ్యాక్‌లో ఫొటోల యాప్‌ను ఓపెన్ చేయండి.
- మీ ఐఫోన్ ఫొటోలు లేదా వీడియోలను ఎక్కడ ఇంపోర్ట్ చేయాలో ఎంచుకోండి.
- ఇప్పటికే ఉన్న ఆల్బమ్‌ని ఎంచుకోవచ్చు లేదా కొత్తదాన్ని క్రియేట్ చేయొచ్చు.
- ఇప్పుడు కేవలం ఫొటోలను ఎంచుకుని (import) బటన్‌ను క్లిక్ చేయండి.
- మీ క్లౌడ్‌లో సేవ్ చేసిన ఫొటోలు ఉంటే.. మీ మ్యాక్ ఫొటోలను ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు.
- ఐఫోన్ నుంచి విండోస్ పీసీకి ఫొటోలను ఇంపోర్ట్ చేయండి.
- మీ విండోస్ పీసీలో మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి ఆపిల్ డివైజ్‌ల యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి
- ఇప్పుడు, యూఎస్‌బీ కేబుల్‌ని ఉపయోగించి మీ ఐఫోన్ మీ పీసీకి కనెక్ట్ చేయండి.
- మీ స్క్రీన్‌పై ప్రాంప్ట్ కనిపిస్తుంది. మీరు సాఫీగా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు అనుమతించాలి.
- ఫొటో యాప్ ఓపెన్ చేసి మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకునే ఫొటోలను ఎంచుకోండి.
- ఆపై “Import From USB Device” ఆప్షన్ ఎంచుకోండి.
- ఆన్-స్క్రీన్ సూచనలతో ఇప్పటికే ఉన్న లేదా కొత్త ఫోల్డర్‌లో ఇంపోర్ట్ చేయండి.
“మీరు ఐక్లౌడ్ ఫోటోలను ఆన్ చేసి ఉంటే.. మీ పీసీకి ఎక్స్‌పోర్టు చేసుకునే ముందు మీ ఫొటోలను మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్ అసలైన, ఫుల్-రిజల్యూషన్ వెర్షన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ ఫొటోలను ఐఫోన్ నుంచి మ్యాక్, విండోస్ పీసీలకు సజావుగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.