Redmi Note 12 is available at Rs 7k discount
Redmi Note 12 Discount : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇదే బెస్ట్ టైమ్.. రెడ్‌మి నోట్ 12 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయిన కొన్ని నెలల తర్వాత భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. సాధారణ అమ్మకపు ధరపై మీకు రూ. 7వేలు తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ. 18,999 నుంచి రూ.11,999కి విక్రయిస్తోంది.
అయితే, కొన్ని నెలల క్రితమే రెడ్‌మి నోట్ 12ని అదే డిస్కౌంట్‌తో అందిస్తోంది. అయితే, ఈ రెడ్‌మి 12 ఫోన్ కొనుగోలు చేయాలా? వద్దా అంటే.. మరో రోజులు ఆగండి చాలు.. భారత మార్కెట్లో రెడ్‌మి నోట్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు, అంచనా ధరలకు సంబంధించి పూర్తి వివరాలు రివీల్ అయ్యాయి. ఈ నెల (జనవరి) 4న అధికారికంగా లాంచ్ కానుంది. లీక్‌ల ఆధారంగా, స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు చాలా ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.
రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
రెడ్‌మి నోట్ 13 5జీ 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, 2400×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్, 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని కలిగి ఉంటుంది. రెడ్‌మి నోట్ 13 5జీ 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో 108ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది.
Redmi Note 12 Rs 7k discount
సెల్ఫీలకు ఫ్రంట్ సైడ్ 16ఎంపీ కెమెరాను కలిగి ఉంటుంది. రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీ కూడా స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. ఈ డివైజ్‌లో 8జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ కూడా సూచిస్తున్నాయి. మరోవైపు, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5జీ, మీడియాటెక్ డైమెన్షిటీ 7200 అల్ట్రా చిప్‌సెట్‌తో 12జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు.
రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ ధర (అంచనా) :
రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ ధర రూ. 20,999 నుంచి ప్రారంభమవుతుంది. అత్యధిక వేరియంట్ ధర రూ. 24,999 వరకు ఉంటుంది. రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీ ధర రూ. 28,999 నుంచి రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ 5జీ ధర రూ. 28,999 నుంచి ప్రారంభం అవుతుంది.