Xiaomi Redmi Note 13 Pro : రెడ్‌మి నోట్ 13 ప్రో సిరీస్ గ్లోబల్ లాంచ్‌పై కొత్త లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Xiaomi Redmi Note 13 Pro : షావోమీ రెడ్‌మి నోట్ 13ప్రో సిరీస్ 5జీ వేరియంట్ అతి త్వరలో గ్లోబల్ లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించి వివరాలు ఎన్‌బీటీసీ వెబ్‌సైట్లో కనిపించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Xiaomi Redmi Note 13 Pro : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి సరికొత్త ప్రో 5జీ వేరియంట్ వస్తోంది. ఈ కొత్త మోడల్ రెడ్‌మి నోట్ 13ప్రో 5జీ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుందని లీక్ డేటా వెల్లడించింది. రాబోయే ఈ ప్రో సిరీస్ థాయిలాండ్ ఎన్‌బీటీసీ వెబ్‌సైట్లో కనిపించింది.

గత సెప్టెంబర్‌లో రెడ్‌మి నోట్ 13 ప్రో మోడల్, రెడ్‌మి నోట్ 13, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్‌తో పాటు చైనాలో లాంచ్ అయింది. అప్పటి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ లాంచ్‌కు సంబంధించి అనేక ధృవీకరణ సైట్‌లలో కనిపిస్తోంది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా రెడ్‌మి నోట్ 13 ప్రో లాంచ్‌ను అయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

Read Also : Aadhaar Card Update : 10ఏళ్లలో మీ ఆధార్ వివరాలను అసలు అప్‌డేట్ చేయలేదా? ఈ తేదీవరకే ఉచితం.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

రెడ్‌మి నోట్ 13 ప్రో సిరీస్ ఇదిగో :
రెడ్‌మి నోట్ 13ప్రో 4జీ, 5జీ వేరియంట్‌లు రెండూ థాయిలాండ్ రెగ్యులేటరీ బోర్డ్ ద్వారా ధృవీకరించింది. మొదటి జాబితాలో మోడల్ నంబర్ (23117RA68G)తో రెడ్‌మి నోట్ 13 ప్రోగా సూచిస్తోంది. ఇటీవల గుర్తించిన మరో స్మార్ట్‌ఫోన్ ఎఫ్‌సీసీ ధృవీకరణ ఆధారంగా 4జీ వేరియంట్ అని స్పష్టంగా పేర్కొంది.

రెండవ జాబితాలో (మోడల్ నంబర్ 2312DRA50G) రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీని నిర్దేశిస్తుంది. ఈ డివైజ్ నిర్ధారణలు మినహా రెడ్‌మి 13ప్రో ఇతర వివరాలు ఏమి వెల్లడించలేదు. ఈ సిరీస్ ఇప్పటికే చైనాలో లాంచ్ కానుందన గ్లోబల్ వెర్షన్‌కు కూడా అదే విధమైన స్పెసిఫికేషన్‌లను అందించే అవకాశం ఉంది. దీని ఆధారంగా, రెడ్‌మి నోట్ 13 ప్రో నుంచి ఏయే ఫీచర్లు, స్పెషిఫికేషన్లు రానున్నాయో ఓసారి పరిశీలిద్దాం.

Redmi Note 13 Pro global launch

రెడ్‌మి నోట్ 13 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
డిస్‌ప్లే : రెడ్‌మి నోట్ 13 ప్రో మోడల్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5కె ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ని కలిగి ఉంది.
ప్రాసెసర్ : స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెనరేషన్ 2 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది. గ్లోబల్ మోడల్ కూడా అదే చిప్‌సెట్‌తో రానుంది.
ర్యామ్ స్టోరేజీ : చైనాలో, స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+ 256జీబీ, 12జీబీ + 512జీబీ 16జీబీ + 512జీబీ వరకు 5 వేరియంట్‌లు ఉన్నాయి.
కెమెరాలు : ఓఐఎస్‌తో 200ఎంపీ శాంసంగ్ (ISOCELL) హెచ్‌పీ3 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపీ మాక్రో సెన్సార్‌, సెల్ఫీలకు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, ఛార్జింగ్ : రెడ్‌మి నోట్ 13 ప్రో 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,100ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
సాఫ్ట్‌వేర్ : సాఫ్ట్‌వేర్ ముందు ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఎంఐయూఐ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో నడుస్తుంది.
కలర్ ఆప్షన్లు : బ్లాక్, బ్లూ, వైట్, సిల్వర్ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

చైనాలో, రెడ్‌మి నోట్ 13 ప్రో ప్రారంభ ధర సీఎన్‌వై 1,499 అంటే.. భారత కరెన్సీలో దాదాపు రూ. 17,400 వరకు ఉండవచ్చు. షావోమీ ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి కూడా తీసుకురావాలని భావిస్తోంది. అయితే లాంచ్ టైమ్‌లైన్ గురించి కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.

Read Also : Airtel CEO Gopal Vittal : ఎయిర్‌టెల్ యూజర్లు సాధారణ సిమ్‌కు బదులుగా ఇ-సిమ్ కార్డులు తీసుకోండి.. ఎందుకంటే?

ట్రెండింగ్ వార్తలు