Airtel CEO Gopal Vittal : ఎయిర్‌టెల్ యూజర్లు సాధారణ సిమ్‌కు బదులుగా ఇ-సిమ్ కార్డులు తీసుకోండి.. ఎందుకంటే?

Airtel CEO Gopal Vittal : ఎయిర్‌టెల్ యూజర్లకు మెరుగైన వినియోగదారు అనుభవం, భద్రతా చర్యలు వంటి ప్రయోజనాలను అందించేందుకు సాంప్రదాయ ఫిజికల్ సిమ్ కార్డ్‌లకు బదులుగా ఇ-సిమ్ తీసుకోవాలని కంపెనీ సీఈఓ గోపాల్ విట్టల్ సూచించారు.

Airtel CEO Gopal Vittal : ఎయిర్‌టెల్ యూజర్లు సాధారణ సిమ్‌కు బదులుగా ఇ-సిమ్ కార్డులు తీసుకోండి.. ఎందుకంటే?

Airtel CEO Gopal Vittal asks users to get e-SIMs instead of regular SIM cards

Airtel CEO Gopal Vittal : ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్లలో ఎలాంటి సిమ్ వాడుతున్నారు. ఇక నుంచి వినియోగదారులు తమ ఫోన్‌లలో సాధారణ సిమ్ కార్డ్‌లకు బదులుగా ఈ-సిమ్‌లను కార్డులను వినియోగించాలని ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ కోరుతున్నారు. ఇ-సిమ్‌లు ప్రత్యేకించి భద్రత, సౌలభ్యం పరంగా అనేక ప్రయోజనాలను అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also : Jio vs Airtel Monthly Fiber Plans : యూజర్లకు పండగే.. జియో, ఎయిర్‌టెల్ నెలవారీ ఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్ల ఫుల్ లిస్టు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

అయితే, ఇ-సిమ్‌లు అంటే.. సాధారణ సిమ్ కార్డ్‌ల లాంటివేని అన్నారు. కానీ, మీరు చొప్పించే ఫిజికల్ కార్డ్‌గా కాకుండా మీ ఫోన్‌లోనే ఇన్‌బుల్ట్ అవుతాయి. ఇ-సిమ్ వర్క్ చేయడానికి మీ డివైజ్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు. తద్వారా ఈజీగా కనెక్ట్‌ అయ్యేందుకు వీలుంటుంది. కానీ, ఇ-సిమ్‌తో కొత్త ఫోన్‌కి మారడం కొంచెం క్లిష్టంగా ఉంటుందని గమనించాలి.

మీ ఫోన్ పోయినా ఈజీగా ట్రాక్ చేయొచ్చు :

ఇటీవల ఎయిర్‌టెల్ కస్టమర్‌లకు ఇ-సిమ్‌ల ప్రయోజనాల గురించి వివరాలను విట్టల్ ఇమెయిల్ పంపారు. ఇ-సిమ్‌లతో ఫాస్ట్ కనెక్టివిటీని అందిస్తాయని, డివైజ్‌ల మధ్య మారడాన్ని సులభతరం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. మీ ఫోన్ ఎవరైనా దొంగిలించిన ఈజీగా ట్రాక్ చేసేందుకు ఇ-సిమ్ టెక్నాలజీ సాయపడుతుందని చెప్పారు.

మీ డివైజ్ పొగొట్టుకున్నా ఇతరులకు సిమ్ డిస్‌కనెక్ట్ చేయడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే .. మీ ఇ-సిమ్‌ను ఫోన్‌ల నుంచి ఫిజికల్‌గా తొలగించే సాంప్రదాయ సిమ్ మాదరిగా ఉండవు. మీ స్మార్ట్‌ఫోన్‌ను కోల్పోయిన ట్రాక్ చేయడం కూడా చాలా సులభంగా ఉంటుందని అని విట్టల్ ఎయిర్‌టెల్ కస్టమర్‌లకు ఇమెయిల్ ద్వారా తెలియజేశారు.

Airtel CEO Gopal Vittal asks users to get e-SIMs instead of regular SIM cards

Airtel CEO Gopal Vittal

ఆపిల్ ఐఫోన్ 12లో ఇ-సిమ్ టెక్నాలజీ :

ఎయిర్‌టెల్ ఇ-సిమ్‌లను సపోర్ట్ చేసే టెక్నాలజీ కలిగిన ఏ డివైజ్‌లోనైనా ఉపయోగించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇ-సిమ్‌ల కోసం ఫిజికల్ సిమ్‌లను మార్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారికి ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ప్రాసెస్ చేయవచ్చు. ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్‌తో ఇ-సిమ్‌ల వినియోగం ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించింది. ఒక ఫోన్‌లో రెండు సిమ్‌లను ఉపయోగించడానికి కొత్త మార్గాన్ని అందిస్తోంది. అప్పటి నుంచి Samsung, Motorola, OnePlus వంటి అనేక ఇతర ఫోన్ బ్రాండ్‌లు కూడా (e-SIM)లతో పనిచేసే ఫోన్‌ల తయారీపై దృష్టిపెట్టాయి.

ఇ-సిమ్‌లకు మారడం అనేది మన ఫోన్‌లను ఉపయోగించే విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. ఫిజికల్ సిమ్ కార్డ్‌లను వదిలేసి ఇ-సిమ్‌లకు మారడం ద్వారా వినియోగదారులు తమ ఫోన్ పోయినా లేదా దొంగిలించినా కనెక్టివిటీని అదనపు భద్రతా ఫీచర్‌లను పొందవచ్చు. ఎయిర్‌టెల్ యూజర్ల మెరుగైన ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ ప్రయోజనాలను అందించనున్నట్టు విట్టల్ తెలిపారు.

Read Also : Aadhaar Card Update : 10ఏళ్లలో మీ ఆధార్ వివరాలను అసలు అప్‌డేట్ చేయలేదా? ఈ తేదీవరకే ఉచితం.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి!