Redmi Note 14 Pro Plus
Redmi Note 14 Pro Plus : కొత్త కారు కొంటున్నారా? రూ.25వేల బడ్జెట్ మించకుండా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 కొనసాగుతోంది. ఈ సేల్ సందర్భంగా రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర భారీగా తగ్గింపు పొందింది.
భారతీయ మార్కెట్లో మొదట రూ.34,999కి లాంచ్ అయిన (Redmi Note 14 Pro Plus) ఈ రెడ్‌మి ఫోన్ OLED డిస్‌ప్లే, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, స్పీడ్ ఛార్జింగ్‌తో కూడిన భారీ బ్యాటరీ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. అన్ని డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ఫోన్ అసలు లాంచ్ ధర కన్నా చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ డీల్ :
అమెజాన్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్ రూ.25,797కి లిస్ట్ అయింది. లాంచ్ ధర రూ.34,999 కన్నా చాలా తక్కువే. అదనంగా, వినియోగదారులు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ధరపై రూ.1,250 తగ్గింపును పొందవచ్చు. అసలు ధర సుమారు రూ.24,547కి తగ్గిస్తుంది.
నెలవారీ ప్రాతిపదికన ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఇష్టపడే కొనుగోలుదారులకు అమెజాన్ నెలకు రూ.1,251 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. అమెజాన్ మోడల్ వర్కింగ్ కండిషన్ బట్టి పాత స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.24,200 వరకు తగ్గింపు పొందవచ్చు.
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్ 6.67-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గొప్ప 3,000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో పవర్ అందిస్తుంది. రోజువారీ వినియోగానికి గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. బ్యాక్ సైడ్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,200mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. లాంగ్ టైమ్ రీఛార్జింగ్‌కు అందిస్తుంది.
ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ డస్ట్, వాటర్ నిరోధకతకు IP66, IP68, IP69 రేటింగ్ కలిగి ఉంది. అదనపు ప్రొటెక్షన్ కోసం ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కలిగి ఉంది.