Redmi Note 14 SE 5G : రెడ్‌మి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా? ఈ నెల 28నే కొత్త 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?

Redmi Note 14 SE 5G : కొత్త రెడ్‌మి ఫోన్ కొంటున్నారా? రెడ్‌‌మి నోట్ 14 SE 5G ఫోన్ వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

Redmi Note 14 SE 5G

Redmi Note 14 SE 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? రెడ్‌మి ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. రెడ్‌మి నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 14 SE 5G రాబోతుంది. ఈ నెల 28న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఈ కొత్త మోడల్ రెడ్‌మి నోట్ 14 5G సిరీస్‌ లైనప్‌లో రానుంది. ఇప్పటికే రెడ్‌మి నోట్ 14 5G, రెడ్‌మి నోట్ 14 ప్రో 5G, రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ 5G వంటి మోడళ్లను కలిగి ఉంది. కంపెనీ ‘కిల్లర్ నోట్’గా క్యాంపెయిన్ చేస్తోంది. ఇది పోటీ ధర వద్ద ఆకర్షణీయమైన ఫీచర్లతో తీసుకువస్తోంది. ఈ సరసమైన 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

బిగ్ డిస్‌ప్లే : మీరు 120Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే పొందుతారు. సూర్యకాంతిలో కూడా రెడ్‌మి ఫోన్‌ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. ఈ స్క్రీన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ : ఈ రెడ్‌మి ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్‌తో వస్తుంది. ఆకర్షణీయమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 16GB వరకు ర్యామ్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : Amazon Great Freedom Sale : గెట్ రెడీ.. ఈ నెల 31 నుంచే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. కొత్త స్మార్ట్‌ఫోన్లపై 80శాతం వరకు డిస్కౌంట్లు..!

అద్భుతమైన కెమెరా : ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. రెడ్‌మి నోట్ 14 SE 5G ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాల సెటప్ ఉంటుంది. 50MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో వస్తుంది. OIS తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.

బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ :
ఈ రెడ్‌మి ఫోన్ పెద్ద 5110mAh బ్యాటరీతో వస్తుంది. టర్బోచార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ బ్యాటరీ TUV SUD సర్టిఫికేట్ కూడా పొందింది. 4 ఏళ్ల వరకు సపోర్టు అందిస్తుంది. ఎక్కువ కాలం మన్నికను పెంచుతుంది.

సౌండ్ క్వాలిటీ : రెడ్‌మి నోట్ 14 SE 5G ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో రానుంది. డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్‌తో వాల్యూమ్‌ను 300శాతం వరకు పెంచుతుంది. మెరుగైన ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

ధర (అంచనా) :
రెడ్‌మి నోట్ 14 SE 5G ఫోన్ ధర ఎంత అనేది కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. ఇదివరకే లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 14 5G ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 17,999 నుంచి అందుబాటులో ఉంది. అయితే, నోట్ 14 ప్రో 5G, నోట్ 14 ప్రో ప్లస్ 5G ధర వరుసగా రూ. 23,999, రూ. 29,999 లభ్యమవుతున్నాయి. రాబోయే రెడ్‌మి నోట్ 14 SE 5G ధర కూడా దాదాపుగా కొంచెం తక్కువగా ఉండొచ్చు.