Redmi Note 14S : వారెవ్వా.. కొత్త రెడ్‌‌మి ఫోన్ ఆగయా.. కెమెరా ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Redmi Note 14S Launch : కొత్త రెడ్‌మి ఫోన్ వచ్చేసింది. కెమెరా ఫీచర్లు అదుర్స్.. 200MP రియర్ కెమెరా, మీడియాటెక్ హెలియో G99 అల్ట్రా చిప్‌సెట్‌తో లాంచ్ అయింది. ధర, ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.

Redmi Note 14s Launch

Redmi Note 14S Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? రెడ్‌మి ఫ్యాన్స్ కోసం సరికొత్త రెడ్‌మి 4జీ ఫోన్ వచ్చేసింది. షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి 4G కనెక్టివిటీతో గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెడ్‌మి నోట్ 14s పేరుతో లాంచ్ అయింది. ఈ కొత్త ఫోన్ మీడియాటెక్ హెలియో G99-అల్ట్రా చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.

Read Also : MG Cars Discounts : కొత్త కారు కావాలా? ఎంజీ ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ. 5 లక్షలపైనే తగ్గింపు.. నెవర్ బీఫోర్ ఆఫర్లు భయ్యా..!

సరికొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌పై రన్ అవుతుంది. రెడ్‌మి నోట్ 14s ఫోన్ 200MP రియర్ కెమెరాను కలిగి ఉంది. 6.67-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. డస్ట్, స్ప్లాష్ నిరోధకతకు IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. అంతేకాదు.. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ధర ఎంతంటే? :
రెడ్‌మి నోట్ 14s ఫోన్ ధర CZK 5,999 (సుమారు రూ. 22,700)గా చెక్ రిపబ్లిక్‌లో నిర్ణయించారు. ఉక్రెయిన్‌లో ఈ హ్యాండ్‌సెట్ ధర UAH 10,999 (సుమారు రూ. 23,100)గా నిర్ణయించారు. ఈ రెండు దేశాలలో అరోరా పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
డ్యూయల్-సిమ్ (నానో+నానో)తో రెడ్‌మి నోట్ 14s సరికొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌పై రన్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ ఆండ్రాయిడ్ వెర్షన్ ఏంటి అనేది కంపెనీ రివీల్ చేయలేదు. షావోమీ (HyperOS) స్కిన్ పైన రన్ అవుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే.. రెడ్‌మి నోట్ 13ప్రో 4G రీబ్యాడ్జ్ వెర్షన్. అంతేకాదు.. ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందిస్తుంది. 6.67-అంగుళాల Full-HD+ (1,080×2,400 పిక్సెల్స్) అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది.

రెడ్‌మి నోట్ 4s మోడల్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G99-అల్ట్రా SoCతో వచ్చింది. రెడ్‌మి నోట్ 13ప్రో 4జీలో ఇదే చిప్‌సెట్ ఉంది. సింగిల్ 8GB+256GB ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో పొందవచ్చు. ఇక ఫోటోలు, వీడియోల విషయానికి వస్తే.. రెడ్‌మి నోట్ 14s ఫోన్ 200MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. వరుసగా 8MP, 2MP అల్ట్రావైడ్, మాక్రో కెమెరాలను కూడా కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్స్ కోసం ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా కూడా ఉంది.

Read Also : Airtel Budget Plan : పండుగ చేస్కోండి.. ఎయిర్‌టెల్ అద్భుతమైన ప్లాన్ మీకోసం.. ఫ్రీ కాలింగ్, ఓటీటీ బెనిఫిట్స్.. 84 రోజులు ఎంజాయ్ చేయొచ్చు!

రెడ్‌మి నోట్ 14s ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.2, NFC, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అంతేకాదు.. IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. 67W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తోంది. రెడ్‌‌మి 14ఎస్ ఫోన్ 161.1×74.95×7.98ఎమ్ఎమ్, 179 గ్రాముల బరువు ఉంటుంది.