Redmi Note 15 5G : రెడ్‌మి ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. షావోమీ కొత్త రెడ్‌మి నోట్ 15 5G ఫోన్ అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. కంపెనీ ఇటీవల టీజర్ రిలీజ్ చేసి ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను ధృవీకరించింది. అంతేకాదు లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. ఈ ఫోన్ జనవరి 6, 2026న లాంచ్ అవుతుంది.
2/5
కొత్త లీకైన రిపోర్టు ప్రకారం.. రెడ్‌మి నోట్ 15 5G ధర, ప్రాసెసర్, బ్యాటరీ వంటి రాబోయే స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్ అయ్యాయి. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మిడ్ రేంజ్‌లో తీసుకువస్తుంది. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వీట్ చేస్తూ రెడ్‌మి 5G భారత మార్కెట్లో రెండు వేరియంట్లలో లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. ఈ ఫోన్ ధర రూ.22,999 నుంచి ప్రారంభం కానుంది.
3/5
రెడ్‌మి నోట్ 15 5G ధర ఎంత? : ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ రె రెడ్‌మి నోట్ 15 ధరను రివీల్ చేశారు. భారతీయ మార్కెట్లో రెడ్‌మి నోట్ 15 5G బేస్ మోడల్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుందని అంచనా. ఈ ఫోన్ ధర రూ. 22,999 మధ్య ఉంటుందని పేర్కొన్నారు. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో టాప్ వేరియంట్ ధర రూ. 24,999 నుంచి ఉంటుంది. అయితే, కంపెనీ ఇంకా ఫోన్ ధరను వెల్లడించలేదు. అదనంగా, బడ్జెట్ రెడ్‌మి ప్యాడ్ 2 5G మోడల్ కూడా భారత మార్కెట్లో లాంచ్ కావచ్చు.
4/5
ఫోన్ డిజైన్ ఇలా? : ఈ ఫోన్ డిజైన్ చైనాలో లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 15 మాదిరిగానే ఉండవచ్చు. లాంచ్ కు ముందు, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108MP మెయిన్ రియర్ కెమెరా ఉంటుందని కంపెనీ టీజర్‌ను రిలీజ్ చేసింది. లీకైన నివేదికల ప్రకారం.. రెడ్‌మి నోట్ 15 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే పెద్ద 5,520mAh బ్యాటరీ ద్వారా పవర్ పొందుతుంది.
5/5
ఈ ఫోన్ భారీ డిస్ ప్లేతో రావచ్చు : 6.77-అంగుళాల పెద్ద అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. రిజల్యూషన్ FHD+, రిఫ్రెష్ రేట్ 120Hz ఉంటుంది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉండవచ్చు. అదనంగా, IP65 రేటింగ్ కూడా ఉండవచ్చు. భవిష్యత్తులో కంపెనీ మరిన్ని ఫీచర్ల వివరాలను రివీల్ చేయనుంది. లాంచ్ సమయంలో ధర, సేల్ ఆఫర్‌లు వెల్లడి కానున్నాయి.